Wednesday, August 5, 2026 07:52 AM
Wednesday, August 5, 2026 07:52 AM

చిరంజీవి – అనీల్ రావిపూడి మూవీ బ్యాక్ డ్రాప్ ఇదే

గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీ సరైన హిట్టు లేక ఇబ్బందులు పడుతోంది. ఇతర హీరోల సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో విజయాలు సాధిస్తుంటే.. మెగా హీరోల సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఒక్క అల్లు అర్జున్ మిగిలిన మెగా హీరోలు ఎవరు సిల్వర్ స్క్రీన్ పై హిట్ కొట్టలేకపోతున్నారు. ఆచార్య సినిమాతో చిరంజీవి బోల్తా పడ్డారు. ఆ సినిమాతో రామ్ చరణ్ కూడా బాగా ఇబ్బంది పడ్డారని చెప్పాలి.

Also Read: త్రివిక్రమ్ కు హ్యాండ్ ఇచ్చేసాడు.. బన్నీ షాకింగ్ స్టెప్

ఇక ఇటీవల వచ్చిన గేమ్ చేంజర్ సినిమా కూడా మెగా ఫ్యామిలీకి రిలీఫ్ ఇవ్వలేకపోయింది. వాల్తేరు వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి హిట్టు కొట్టినా… అందులో రవితేజ క్రెడిట్ కూడా ఉండటంతో పూర్తిగా మెగా ఫ్యామిలీకి క్రెడిట్ రాదని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ కూడా సినిమాల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ప్రస్తుతం ఆయన అంగీకరించిన సినిమాలు కూడా ముందుకు వెళ్లకపోవడంతో.. పవన్ కళ్యాణ్ కాస్త ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి.

Also Read: ఛావా ఎఫెక్ట్.. మహారాష్ట్ర పోలీసులకు కొత్త ప్రాబ్లం

ఇక ఇదిలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభరా అనే సినిమాలో నటిస్తున్న చిరంజీవి.. త్వరలోనే అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమాను మొదలుపెట్టనున్నారు. అలాగే దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ తో కూడా చిరంజీవి సినిమా స్టార్ట్ అవుతుంది. అనీల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చే సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తామని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి చేసిన కొన్ని సినిమాలు విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. దీనితో ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్