Sunday, June 21, 2026 02:54 PM
Sunday, June 21, 2026 02:54 PM

బ్రేకింగ్: కొత్త జిల్లాలపై చంద్రబాబు సంచలన నిర్ణయం

దాదాపు ఏడాది కాలంగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో అనేక చర్చలు జరుగుతూ వస్తున్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ లు కూడా వినపడుతున్నాయి. అలాగే జిల్లాల పునర్విభజన కూడా చేయాలనే డిమాండ్ లు సైతం ఉన్నాయి. ఇదే సమయంలో అమరావతి కొత్త జిల్లా సహా పలు రెవెన్యూ డివిజన్ లపై కూడా చర్చ జరుగుతూ వచ్చింది. దీనిపై ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి.. కసరత్తు మొదలుపెట్టింది.

Also Read : కర్నూలు టీడీపీపై ఆందోళనలో అధిష్టానం.. సంచలన నివేదికలతో కలవరం..!

ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటుగా పలు రెవెన్యూ జిల్లాల గురించి కూడా చర్చించింది సబ్ కమిటీ. గత రెండు రోజుల నుంచి సిఎం చంద్రబాబు.. కేబినేట్ సబ్ కమిటీతో భేటీ అవుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో తాజాగా సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం. కొత్తగా మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు సిఎం.

Also Read : మద్యం కేసులో పీకల్లోతు ఇరుకున్న పెద్దన్న..!

మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపిన సిఎం.. మార్పు చేర్పులకు కూడా ఆమోదం తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేసారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్‌, ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవెన్యూ డివిజన్‌, మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్‌, నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌, సత్యసాయి జిల్లాలో మడకశిర రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాలో ఆదోని మండలాన్ని విభజించి పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్