Thursday, May 7, 2026 12:09 AM
Thursday, May 7, 2026 12:09 AM

కార్యకర్తల మాట వినాల్సిందే.. నేతలకు చంద్రబాబు వార్నింగ్..!

దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోంది. దాదాపు 15 వేల రూపాయల వరకు పెన్షన్లు అర్హులకు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని మొదటి నెల నుంచి నిలబెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు.. ఈ విషయంలో పార్టీ నాయకత్వాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. తాజాగా పార్టీ నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు స్పష్టమైన వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి డిసెంబర్ క్యాలెండర్ రూపొందించామని ప్రకటించిన సీఎం.. ప్రతినెలా 1న ఎలాంటి ఆటంకం లేకుండా పెన్షన్ల పంపిణీ జరుగుతోందన్నారు.

Also Read : రైతులతో గ్యాప్ ఉంది.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆర్థికసాయం అందటం లేదని.. పెన్షన్ల కోసమే ఇప్పటివరకు రూ.50,763 కోట్లు ఖర్చు పెట్టామన్నారు దేశంలోనే ఇది అతిపెద్ద డీబీటీ కార్యక్రమమని.. 17 నెలలుగా నేనే స్వయంగా పాల్గొని పెన్షన్లు అందిస్తున్నానని చెప్పుకొచ్చారు. పొలిటికల్ గవర్నెన్స్ అన్నది కూటమి ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. కార్యకర్తల మనోభీష్టం మేరకే నాయకత్వం ముందుకెళ్లాలని కోరుతున్నానని, కార్యకర్తలను తక్కువ అంచనా వేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గౌరవిస్తున్నానన్నారు.

Also Read : ప్రక్షాళన దిశగా వైసీపీ.. టార్గెట్ ఫిక్స్..!

వచ్చే నెల 5న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో కార్యకర్తలు పాల్గొనాలి.. పింఛను పంపిణీలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని ఆదేశించారు సీఎం. గత పాలకుల విధ్వంసంతో రాష్ట్రానికి ఇబ్బందులు వచ్చాయన్న ఆయన.. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందిస్తామని తెలిపారు. అర్హుడైన ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్న ఆయన.. అర్హులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకోలేని వారికి కార్యకర్తలు, నాయకులు సహకరించాలని.. ఈ విషయంలో ఎటువంటి అక్రమాలు జరగడానికి వీలు లేదని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్