Saturday, April 4, 2026 06:01 PM
Saturday, April 4, 2026 06:01 PM

ఏపీలో మరో రేపిస్ట్ సంగతేంటి..? సేమ్ సీన్ రిపీట్ అవుతుందా..?

ఏపీలో అత్యాచారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. పలువురు నిందితులు కూడా ఏపీ సర్కార్ దెబ్బకు బలవన్మరణం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఓ ఘటనపై సిఎం చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నారు. మాచర్ల పట్టణంలో పంచాయితీరాజ్ శాఖలో అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగినిపై జరిగిన అమానుష ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు, నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Also Read : బడా కంపెనీలే లక్ష్యంగా వాట్సాప్ లో కొత్త తరహా మోసం.. జాగ్రత్త

పట్టణంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. దాహమని నీళ్లడిగి ఇంట్లోకి చొరబడిన సుమారు 50 ఏళ్ల వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు బాధితురాలు చెప్పడంతో, పట్టణంలోని పలు మద్యం దుకాణాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు తనిఖీ చేశారు. అదనపు ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

Also Read : లోకేష్ సింధనూరు యాత్రకు ఊహించని రెస్పాన్స్..!

నిందితుడికి సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ పి.కె. శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితురాలు నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపధ్యంలో.. ఆమె ఆరోగ్యంపై సిఎం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనపై బాధితురాలికి న్యాయం చేయడంలో ఎటువంటి జాప్యం జరగకూడదని పోలీసులకు కఠిన ఆదేశాలు ఇవ్వడంతో.. నిందితుడు పరారీలో దొరుకుతాడా.. బాహ్యప్రపంచానికి కనపడతడా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

యుద్ధం.. అప్రకటిత లాక్...

పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాలను...

లోకేష్ సింధనూరు యాత్రకు...

కర్ణాటకలోని సింధనూరులో ఏపీ ఐటీ, విద్యాశాఖ...

వాళ్ళను సస్పెండ్ చేస్తా.....

క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే టీడీపీలో ఇటీవలి...

వైసీపీలో ముసలం.. మీ...

వైసీపీ అంటే.. అది ఒక నియంత...

‘మేం ముగ్గురం’.. షాకిచ్చిన...

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సోషల్...

బ్రేకింగ్; ఏపీ ప్రజలకు...

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల స్వప్నమైన దక్షిణ...

పోల్స్