Wednesday, February 25, 2026 08:50 PM
Wednesday, February 25, 2026 08:50 PM

సీఎంఓలో ఆ ఇద్దరు అవుట్..?

సీఎం కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను తప్పించి, మరో ఇద్దరు లేదా ఒక్కరిని మాత్రమే సీఎంఓలో నియమించుకోవాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సచివాలయంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు తన కార్యాలయ ఐఏఎస్ అధికారుల నియామకాల్లో జరిగిన పొరపాట్లు సాధ్యమైనంత వరకు సీఎం చంద్రబాబు సరిచేసుకుంటున్నారు. ఇప్పుడు సీఎంఓలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను తప్పని సరిగా తప్పించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయట. ఇప్పటికే కొందరితో చంద్రబాబు రహస్యంగా చర్చంచారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Also Read : వైసీపీ నేతకు టీడీపీ పదవి.. అంతా గందరగోళం..!

ప్రస్తుతం సీఎంఓ ఎలా ఉంది.. ఎలాంటి అధికారులు పనిచేస్తున్నారు.. అనే విషయంపై అధికారుల అభిప్రాయం ఎలా ఉందంటే.. ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రం బాగానే ఉన్నారంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓ అంటే.. ఓ నియంత ఆధీనంలో ఉన్నట్లే. ప్రస్తుతం అంత దారుణంగా లేదని.. చంద్రబాబు సీఎంఓ పరిస్థితి కొంత వరకు పర్వాలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఈ విషయంలో అధికారుల కామెంట్ లేమిటంటే.. ఎవరిని ఎంతవరకు నమ్మాలనే విషయంలో చంద్రబాబు కొంత అలసత్వం వహిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజాయితీపరులు, సమర్ధులైన ఐఏఎస్ అధికారుల్లో ఎవరిని, ఎక్కడెక్కడ నియమించుకోవాలో 40 ఏళ్లు పైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇప్పటికీ స్పష్టంగా తెలుసు.

అయితే చంద్రబాబును ఏమార్చిన కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే చర్చ సచివాలయంలో జోరుగా జరుగుతుంది. నిజాయితీ గురించి చంద్రబాబు పదే, పదే చెబుతుంటారు. అయితే కొందరు అధికారులు మాత్రం వాటిని ఏ మాత్రం ఆచరించటం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసు. ప్రస్తుత చంద్రబాబు హయాంలో పారదర్శకంగా పాలన జరుగుతున్నప్పటికీ.. కొందరు అధికారుల తీరు, నిర్లక్ష్యం వల్ల ఆశిస్తున్న మైలేజీ మాత్రం రావటం లేదట.

Also Read : భారత జట్టులో సంచలన మార్పులు..!

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారుల మధ్య జరుగుతున్న అధికార ఆధిపత్య పోరు పై సచివాలయంలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే.. వ్యక్తిగత పేరు కోసమే ఆ ఇద్దరు అధికారులు తెగ తాపత్రయపడుతున్నారనే చర్చ జోరుగా జరుగుతుంది. ఇద్దరిలో ఒకరిపై వైసీపీ ముద్ర ఉంది. మరొకరు మాత్రం టీడీపీ అంటే అభిమానం ఆయన మాటల్లో కన్పించటం లేదు. ఆ ఇద్దరిలో ఒకరు వైసీపీ ప్రభుత్వంలో అధికారంగా ఒక వెలుగు వెలిగింది నిజం. మరి అలాంటి అధికారిని ఎందుకు నియమించుకున్నారో ఇప్పటికీ ఎవరికీ తెలియటం లేదు. అయితే ప్రస్తుతం సీఎంఓలోని ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరుకుంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందనేది సచివాలయంలో బాగా వినిపిస్తున్న మాట.

ఇద్దరి మధ్య విభేదాలపై ఇప్పుడు చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎంఓలో ఏం జరుగుతుందనే విషయంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నివేదిక వచ్చిన వెంటనే ప్రక్షాళన ఉంటుందనే మాట బబాగా వినిపిస్తోంది. కొసమెరుపు ఏమిటంటే.. ప్రస్తుతం సీఎంఓలో పనిచేస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులతో పాటు కొంతమంది అధికారుల ఆంతరంగిక అధికారులుగా పనిచేస్తున్న వారిని కూడా తప్పించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ నేతకు టీడీపీ...

తెలుగుదేశం పార్టీలో పదవుల కేటాయింపు కొంత...

జూన్ 15 ముహుర్తం.....

"జూన్ 15వ తేదీన మళ్లీ వస్తా.....

జగన్ ను తిట్టోద్దని...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్తీ లడ్డు వ్యవహారంపై...

అందరి జాతకాలు బయటపెడతా..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్...

ప్లాన్ ప్రకారమే అంతా.....

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

తిరుమల పవిత్రతకు ప్రత్యేక...

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిరక్షణపై...

పోల్స్