ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వత రాజధాని గా గుర్తిస్తూ.. నేడు రాజ్యసభలో కూడా బిల్ ఆమోదం పొందనున్న నేపధ్యంలో.. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలుస్తోందన్నారు చంద్రబాబు. రాజ్యసభలో మన రాజధాని అమరావతి బిల్లు ఆమోదం పొందబోతోందని, కేంద్ర సహకారంతో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతోందని తెలిపారు.
Also Read : ఎమ్మెల్యేలు సీరియల్స్ చూడటం ఆపాలి.. చంద్రబాబు సంచలన కామెంట్స్
అమరావతికి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన అతి తక్కువ సమయంలోనే బిల్లును ప్రవేశపెట్టిందని, అమరావతి మనకు ఒక సెంటిమెంట్ అన్నారు సిఎం. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని.. ఇప్పుడు మావిగన్ అని మాట్లాడుతున్నారు… అమరావతి పట్ల వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట అన్నారు సిఎం. అమరావతి పేరు పలకడానికే జగన్ ఇష్టపడరని.. అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారని ఎద్దేవా చేసారు. గతంలోనూ ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని పేరు ఉంటే… ఎస్ఆర్ఎంగా మార్పించారన్నారు.
Also Read : వైసీపీ నేతలు డబుల్ గేమ్.. వాటి విషయం ఏమైంది..?
అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉండి నిత్యం విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్‌లోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందన్నారు. మా రాజధాని అమరావతి అని ప్రతీ ఒక్కరిలో భావన రావాలన్నారు. రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్లో ఆమోద ప్రక్రియ పూర్తయినట్లే అన్నారు. కర్నూలులో హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు కూడా సాధ్యమైనంత త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. తాను కూడా రాజధాని సంబరాల్లో పాల్గొంటున్నా అన్నారు సిఎం.

