Tuesday, March 3, 2026 09:18 PM
Tuesday, March 3, 2026 09:18 PM

వారిని దూరం పెట్టారా..? లేక ఉంటున్నారా..? 

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతల తీరుపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారా..? అంటే అవుననే మాటే వినిపిస్తోంది. వారం రోజుల క్రితం పల్నాడు జిల్లా వినుకొండలో చంద్రబాబు పర్యటించారు. ఆ సమయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు కూడా. అది చేస్తాం.. ఇది చేస్తాం.. అంటున్న జీవీతో.. ముందు చేసి చూపించు అనేశారు. అలాగే ఐటీడీపీ నమోదులో వినుకొండ టాప్ ప్లేస్‌లో ఉందని గొప్పగా చెప్పిన జీవీ గాలిని స్టేజ్ మీదే తీసేశారు. 80వ స్థానంలో ఉందని నాకు తెలుసు అంటూ బాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే ఇలా జీవీపై చంద్రబాబు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేయడం వెనుక చాలా పెద్ద కారణం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read : మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 5 వేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు, సీనియర్ కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులలో ఎక్కువ మంది చంద్రబాబు పట్ల వ్యతిరేకత, అసంతృప్తితో ఉన్నారనేది ఇప్పుడు జిల్లాలో వినిపిస్తున్న మాట. ఇందుకు ప్రధాన కారణం పదవుల కేటాయింపు అయితే.. మరో కారణం… సీనియర్ నేతలను చంద్రబాబు దూరం పెట్టారనే ప్రచారం. అయితే పార్టీలో మాత్రం… చంద్రబాబు దూరం పెట్టారా.. లేక నేతలే దూరంగా ఉన్నారా అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా అధినేతకు, నేతలకు, కార్యకర్తలకు మద్య దూరం పెరిగిన మాట మాత్రం వాస్తవం. ఇంకా చెప్పాలంటే.. అధినేత పట్ల విధేయత లోపించిందనే మాట బాగా వినిపిస్తోంది.

Also Read : ఏఐ డీప్‌ఫేక్ కలకలం : మహిళ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసుల కేసు నమోదు!

అధికారం లేనప్పుడు కనిపించిన ఆధారాభిమానాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయాయని సొంత పార్టీ కార్యకర్తలే చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించటంలో మీనమేషాలు లెక్కించారనేది ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలపై తొలి నుంచి వినిపిస్తున్న విమర్శలు. అంబటి వ్యాఖ్యలను ఏడాది క్రితమే పార్టీకి దూరమైన జీవీ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని కూడా వ్యాఖ్యానించారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఇప్పటి వరకు కనీసం నోరు మెదపటం లేదు. అంబటి అరెస్టు, బెయిల్, విడుదల అనంతరం చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపట్టడం లేదు. అంబటి సైగల మీద మండలిలో హోమ్ మంత్రి అనిత వ్యాఖ్యానించారు తప్ప.. మరో ఇతర ఎమ్మెల్యే ఇది తప్పు అనలేదు. ఈ విషయంపై పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకున్న చంద్రబాబు.. నేతల రహస్య సంబంధాలపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : ఆఫ్ ది రికార్డ్.. అందుకే విందు రాజకీయం..!

ఖండించకపోవటం వెనుక అంబటి సహా పలువురు వైసీపీ నేతలో తెర వెనుక వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు చంద్రబాబు దృష్టికి వచ్చింది. ఇక కొందరు సీనియర్ నేతలైతే.. మాకు పదవి ఇవ్వలేదు కదా.. పదవిలో ఉన్న వాళ్లు మాట్లాడుతారులే అని తన అనుచరుల దగ్గర వ్యాఖ్యానించిన విషయం కూడా ఇప్పుడు చంద్రబాబు చెవిలో పడింది. నిజానికి మాజీ మంత్రులు కన్నా లక్ష్మీ నారాయణ, నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ధూళ్లిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, ఆలపాటి రాజా వంటి సీనియర్లు పదవులు ఆశించారు. కానీ వారిని చంద్రబాబు పక్కన పెట్టారు. అందుకే వారు కూడా పార్టీని పక్కన పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.

ఈ విషయాలు తెలుసుకున్న చంద్రబాబు.. ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండ పర్యటనలో జీవీ ఆంజనేయులు మాటలకు చంద్రబాబు పదే పదే బ్రేకులు వేశారు. వినుకొండలో 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తామన్న జీవీతో.. నియోజకవర్గంలో ఉన్నదే లక్ష ఎకరాలు కదా.. అనేశారు. అలాగే ఉద్యాన పంటల హబ్‌గా వినుకొండను మారుస్తా అని జీవీ అన్న వెంటనే.. ముందు చేసి చూపించు.. అన్నారు. దీంతో జీవీ పరువు పోయింది కదా.. అని సొంత పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముందు పార్టీ పట్ల, అధినేత పట్ల విధేయతగా ఉంటే.. పదవులు అవే వస్తాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రైతులకు ఇచ్చిన డ్రోన్లు...

ప్రతి పనిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలనేది...

వారి మెడకే చుట్టుకున్న...

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్...

కల్తీ నెయ్యి కేసు:...

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి...

అటవీశాఖలో సంస్కరణలు: పవన్...

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

దేవుడి ముందే రచ్చ...

ఏపీలో ప్రతిపక్షమే లేదు. కానీ.. తెలుగుదేశం...

ఏఐ డీప్‌ఫేక్ కలకలం...

సాంకేతికతను ఆసరాగా చేసుకుని మహిళల గౌరవానికి...

పోల్స్