Thursday, March 5, 2026 08:34 PM
Thursday, March 5, 2026 08:34 PM

పెళ్లిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

దేశ వ్యాప్తంగా జనాభా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా సిఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేసారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ప్రకటనపై శాసనసభలో సభ్యులు లేవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. మాల్తూషియన్ థీయరీ ఆఫ్ పాపులేషన్ పై గతంలో విస్తృత చర్చ జరిగేదని, ప్రకృతి విపత్తులు, మహమ్మారులు వస్తే జనాభా నియంత్రణ జరుగుతుందని ఈ థియరీని ప్రతిపాదించారని వ్యాఖ్యానించారు.

Also Read : ముగిసిన నితీష్ కుమార్.. సిఎం ప్రస్తానం..!

96-97 సమయంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కోసం బ్రేక్ సైలెన్స్ అంటూ వివిధ ప్రచారాలు చేశామని గుర్తు చేసారు. తదుపరి ఏపీ ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారిందన్నారు. ఈ తరహా సంస్కరణలే అమలు చేశామన్నారు చంద్రబాబు. ఆర్ధిక సంస్కరణలు, సెల్ ఫోన్ లాంటి టెక్నాలజీ విప్లవం, ఫ్యామిలి ప్లానింగ్ లాంటి అంశాలు ఎన్నో అమలు చేసి విజయం సాధించామని పేర్కొన్నారు చంద్రబాబు. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడు 1.5 గా ఉందని, కుటుంబ నియంత్రణ ఇప్పుడు అప్రస్తుతం జనాభా నిర్వహణ గురించి మాట్లాడితే కొందరు విమర్శించారన్నారు.

Also Read : ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

దక్షిణ భారత్ లో నెగెటివ్ గ్రోత్ నమోదు అవుతోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణ భారత్ రాష్ట్రాలు నష్టపోతాయని, ఇప్పుడు ఒక్కరు వద్దు, ఇద్దరు ఒకే, ముగ్గురు ముద్దు అనే నినాదం తీసుకోవాల్సిన అవసరం వచ్చేసిందన్నారు. పేదలు, గిరిజనులు ఎక్కువ మంది పిల్లలను కంటున్నారు. కానీ ఏపీఎల్ కుటుంబాల్లో మాత్రం ఈ పరిస్థితి కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రపంచంలో మహిళలకు గౌరవం ఇచ్చే ఏకైక దేశం భారత్ మాత్రమేనన్నారు. గతంలో తీసుకువచ్చిన వివిధ పాలసీల వల్ల వివాహ సంప్రదాయాల్లోనూ చాలా మార్పులు వచ్చాయని, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో టోటల్ ఫెర్టిలిటీ రేట్ 3 గా నమోదు అవుతోందన్నారు. టీనేజి ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలు గతంలో జరిగేవి. ఇప్పుడు లేట్ మ్యారేజ్ వల్ల కూడా సంతాన లోపం జరుగుతోందని హెచ్చరించారు సిఎం చంద్రబాబు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బొత్సను పూర్తిగా పక్కన...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

ఆయన సీఎంఓలో కాలకేయుడు..!

సీఎంఓలో పనిచేసే ఐఏఎస్ అధికారులకు ఓర్పు,...

ఆ విషయంలో పూర్తిగా...

తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగించన...

నాడు వద్దన్న అదానీ...

ఏపీలో అదాని గ్రూప్ నుంచి సౌర...

నానీ యాక్టివ్ అవ్వడానికి...

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ...

ఈ చైర్మన్ మాకు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు హాట్...

పోల్స్