“జూన్ 15వ తేదీన మళ్లీ వస్తా.. ఆ రోజే ప్రారంభోత్సవం.. ఏం చేస్తున్నారో నాకు ప్రతి వారం రిపోర్టు ఇవ్వాలి.. ఆ రోజుకు ఎట్టి పరిస్థితుల్లో పనులు పూర్తి చేయాల్సిందే..” మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లె వద్ద పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సనీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జూన్ 15న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆ రోజు ప్రాజెక్టు ప్రారంభించి.. మార్కాపురం జిల్లాకు వెలుగొండ తాగు, సాగునీరు అందిస్తా అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read : జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?
మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన సీఎం చంద్రబాబు.. ఫీడర్ కెనాల్‌కు శంకుస్థాపన చేశారు. మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి నియోజకవర్గాలకు వెలుగొండ ద్వారా ఈ ఏడాదే నీరు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రాజెక్టు టన్నెల్ పనులను చంద్రబాబు స్వయంగా పరిశీలించారు. ఇంజనీర్లతో ముఖాముఖి నిర్వహించారు. రెండు టన్నెల్స్ ఎంత వరకు పూర్తయ్యాయి.. ఇంకా ఎంత తవ్వాల్సి ఉందనే వివరాలు తెలుసుకున్నారు. మొదటి టన్నెల్ మరో 2,400 మీటర్లు తవ్వాల్సి ఉందని ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం రేయింబవళ్లు వర్క్ జరుగుతుందని.. నెలకు 600 మీటర్ల పనులు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : కూర్గ్ లో విల్లా.. లగ్జరీ కార్లు.. రష్మిక – విజయ్ ఆస్తుల విలువ ఎంతంటే..?
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించేందుకు వెలుగొండ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా రెండు సొరంగాలు తవ్వుతున్నారు. ఇందులో మొదటి సొరంగం పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 841 అడుగుల ఎత్తు దాటిన తర్వాతే వెలుగొండ ద్వారా నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. జూన్ నెలాఖరు నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ లోపే సొరంగం తవ్వకం పనులు పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును మళ్లీ తానే ప్రారంభోత్సవం చేస్తానని తెలిపారు. నిధుల కొరత లేదని.. పనులు శరవేగంగా నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.

