మేధావులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. 2014లో రాష్ట్రం విడిపోయిన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కొంతమంది పెద్ద మనుషులు (అలా అని వాళ్లకు వాళ్లే చెప్పుకున్నారు… కాబట్టి వాళ్లే పెద్ద మనుషులు) గళం విప్పారు. ఫోరం పెట్టుకున్నారు. సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సలహాలు సూచనలు ( ఇవ్వమని ప్రభుత్వం తరఫున ఒక్కరు కూడా అడగలేదు) ఇచ్చారు. అవి ఎలాంటివి అయినా సరే అమలు చేయాలని హుకుం జారీ చేశారు. అవి పరిగణలోకి తీసుకోకపోతే.. ప్రభుత్వం తప్పు చేస్తోంది అంటూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. పైగా వారిపై ఎవరైనా ఏమైనా విమర్శలు చేస్తే.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ ప్రజల్లో విష బీజాలు నాటే ప్రయత్నం మాత్రం గట్టిగా చేశారు.
Also Read : పంత్ కు ఏమైంది..? 27 కోట్ల ఒత్తిడిలో ఉన్నాడా..?
ఇప్పుడు ఒక పెద్ద మనిషి గురించి తప్పని సరిగా మాట్లాడుకోవాల్సిందే. ఆయనే చలసాని శ్రీనివాస్. ఆంధ్ర మేధావుల ఫోరం అని ఒకటి స్థాపించారు. దాన్ని అడ్డు పెట్టుకుని 2014-19 మధ్య కాలంలో ప్రతి రోజు టీవీల్లో కనిపించారు. ఆయన చెప్పింది నిజమంటూ ఊదరగొట్టారు. మేధావుల చర్చా వేదికలు అంటూ విశాఖ, విజయవాడ, తిరుపతి, కర్నూలు నగరాల్లో ప్రత్యేకంగా నిర్వహించారు. దీనికి ఓ వర్గం నేతలను మాత్రమే ఆహ్వానించారు. వాళ్లు చెప్పిందే నిజం అనేలా ప్రభుత్వంపై బురద జల్లారు. ఇక అప్పట్లోనే అమరావతిపై విషం చిమ్మారు సో కాల్డ్ మేధావి చలసాని శ్రీనివాస్. అమరావతిలో భారీ భవనాలు ఎందుకు… రాజధానిగా పంటలు పండే పొలాలు ఎందుకు.. రాజధాని నిర్మాణం కోసం వేల కోట్లు ఖర్చు ఎందుకు.. అసలు రాజధాని అంటే ఏమిటంటూ కూడా ప్రభుత్వం చేపట్టిన పనులకు మోకాలు అడ్డే ప్రయత్నం చేశారు. చివరికి దొంగ చాటుగా ప్రభుత్వంపై కేసులు కూడా వేయించారు అనే ఆరోపణలు కూడా ఈ సో కాల్డ్ మేధావిపై ఉన్నాయి.
Also Read : నేను, పవన్, మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
అయితే ఇదంతా కేవలం వైసీపీ గెలుపు కోసం మాత్రమే అనే విషయం 2019 ఎన్నికల ఫలితాల తర్వాత అందరికీ తెలిసిపోయింది. అప్పటి వరకు ఏపీకి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.. అసలు ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేసిన మేధావుల ఫోరం.. జగన్ గెలిచిన తర్వాత నుంచి కనిపించటం మానేసింది. ఇంకా చెప్పాలంటే.. మాయమైపోయింది. ఐదేళ్లల్లో కనీసం ఒక్కసారి కూడా ఆంధ్ర మేధావుల ఫోరం.. రాష్ట్రం అభివృద్ధి గురించి ఒక్క సూచన కూడా చేయలేదు. పైగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన రోజున ఆహో ఓహో అంటూ బాకాలు ఊదారు. ఇక ఐదేళ్ల పాటు ఏపీలో విధ్వంసం కొనసాగినా, కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగకపోయినా కూడా ఆంధ్ర మేధావుల ఫోరం (మరి వీరిని మేధావులుగా ఎవరు గుర్తించారో తెలియదు) కనీసం పల్లెత్తు మాట అనలేదు.
Also Read : అరెస్ట్ చేసేయండి.. లిక్కర్ స్కాంలో సుప్రీం షాక్
జగన్ ఓడిన తర్వాత ఏపీలో కూటమి సర్కార్ కొలువు తీరింది. మళ్లీ ఈ సో కాల్డ్ మేధావులు తెరపైకి వచ్చారు. రాష్ట్రంలో ఏదో విధ్వంసం జరిగిపోతోందని.. వ్యవస్థలన్నీ అస్తవ్యస్తమయ్యాయంటూ గగ్గొలు పెడుతున్నారు. తాజాగా అమరావతి పునః ప్రారంభ వేడుకను కూటమి ప్రభుత్వం గొప్పగా నిర్వహించింది. అమరావతి పునర్ నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అలాగే ఏపీకి పెట్టుబడులు కూడా వెల్లువలా వస్తున్నాయి. పునః ప్రారంభ వేడుక తర్వాత చలసాని శ్రీనివాస్ వైసీపీ అనుకూల మీడియాలో ప్రత్యక్షమయ్యారు. ఏపీలో ఏదో అన్యాయం జరిగిపోతోంది అంటూ గగ్గొలు పెట్టారు. ప్రధాని మోదీ వచ్చారు.. వెళ్లారు.. అంతే కదా.. ఏపీకి జరిగిన మేలు ఏమిటీ అంటూ చలసాని శ్రీనివాస్ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ప్రజల నెత్తిన మోదీ ఆమ్లెట్ వేశారు.. పవన్ కల్యాణ్‌కు చాక్లెట్ ఇచ్చారు.. చంద్రబాబుకు బిస్కెట్ ఇచ్చి పోయారు.. అని వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఇంతకు ముందు బూడిద, మురికి నీళ్లు ఇచ్చారు.. ఏమిచ్చారు ఏపీకి.. దేనికి ఆనందం.. ఎందుకు గొర్రెల్లా చప్పట్లు కొడతారు.. అంటూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారు. రాష్ట్రం గురించి మాట్లాడుదాం అంటూనే.. ఒక పార్టీకి అనుకూలంగా భజన చేశారు చలసాని శ్రీనివాస్.
Also Read : లిక్కర్ స్కామ్.. భారతీ అరెస్టు తప్పదా..?
చలసాని వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు చలసాని ఎవరూ అని ప్రశ్నిస్తున్నారు. 2019-24 మధ్య ఏమయ్యారు అని నిలదీస్తున్నారు. 2019 నుంచి ఏపీలో విధ్వంసం జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదంటున్నారు. ప్రజా వేదిక కూల్చినప్పుడు, రాజధాని రైతులు, మహిళలపై కేసులు పెట్టినప్పుడు, కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు, పాదయాత్ర చేస్తున్న రైతులపై రాళ్ల దాడి జరిగినప్పుడు కళ్లు మూసుకుని నిద్ర పోయావా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు జగన్ పాలనలో ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదని ఒక్కసారి అయినా వైసీపీ నేతలను ప్రశ్నించారా అని ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. అసలు ఆంధ్ర మేధావుల ఫోరం ఐదేళ్లలో చేసిన కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. జగన్ దగ్గర ప్యాకేజీ తీసుకుని ఐదేళ్లు నోరు ఎత్తలేదని.. ఇప్పుడు కూడా వైసీపీ అధినేత కళ్లల్లో ఆనందం కోసమే కూటమి సర్కార్ పైన విషం చిమ్ముతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

