Wednesday, April 1, 2026 12:24 PM
Wednesday, April 1, 2026 12:24 PM

నవ్యాంధ్ర చరిత్రలో కీలక అడుగు.. నేడు పార్లమెంట్ లో కీలక పరిణామం..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తుకు సంబంధించి నేడు కీలక, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో రూపొందించిన ‘ఏపీ చట్ట సవరణ బిల్లు’ను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లుపై చర్చ జరగనుండటంతో అటు ఢిల్లీలోనూ, ఇటు ఏపీలోనూ రాజకీయ వాతావరణం వేడెక్కింది. గత కొన్నేళ్లుగా రాజధాని మార్పు, మూడు రాజధానుల ప్రతిపాదనలతో అమరావతి మనుగడపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

Also Read : దుమారం రేపుతున్న కాగ్ నివేదిక..!

ఈ నేపథ్యంలో, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నేడు లోక్ సభలో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, అమరావతికి న్యాయపరమైన రక్షణ లభించడంతో పాటు, భవిష్యత్తులో రాజధాని మార్పు వంటి నిర్ణయాలు తీసుకోవడం అంత సులభం కాదు. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక బలమైన పునాదిగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లుపై జరిగే చర్చలో భాగంగా టీడీపీ తరపున ఐదుగురు ఎంపీలు తమ గళాన్ని వినిపించనున్నారు. అమరావతి ఆవశ్యకతను, గత ఐదేళ్లుగా అక్కడి రైతులు పడిన ఇబ్బందులను వారు సభ దృష్టికి తీసుకురానున్నారు.

Also Read : ట్రంప్ నోటి దూల.. వాళ్ళు బానిసల బిడ్డలు అంటూ వివాదాస్పద కామెంట్..!

వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కూడా పార్లమెంట్ లో చర్చ జరగనుంది. అలాగే, జనసేన ఎంపీ బాలశౌరి కూడా ఈ చర్చలో పాల్గొని, అమరావతి అభివృద్ధికి ఈ చట్టబద్ధత ఎంత కీలకమో వివరించనున్నారు. మరోవైపు, ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు కూడా ఈ చర్చలో పాల్గొనే అవకాశం ఉండటంతో, సభలో చర్చ ఆసక్తికరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురావడం వెనుక అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను, పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశం కూడా ఉంది. చట్టబద్ధత లభిస్తే ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు రావడం సులభతరం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: మారిన మాట.....

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి విషయంలో...

దుమారం రేపుతున్న కాగ్...

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్...

మెగా ఫ్యాన్స్ కు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ధర్నా వ్యవహారంపై సిఎం...

అమరావతిలో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా...

అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్...

ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస...

ఏపీలో ముగిసిన మావోల...

ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు...

పోల్స్