Sunday, June 21, 2026 06:20 AM
Sunday, June 21, 2026 06:20 AM

ప్రభాస్ పై బాలీవుడ్ హీరోయిన్ రాజకీయం..?

బాహుబలి సినిమా తర్వాతి నుంచి బాలీవుడ్ డామినేషన్ ఇండియన్ సినిమాపై తగ్గిన మాట వాస్తవం. ఆ తర్వాత భారీ సినిమాలు వచ్చినా.. తెలుగులో రిలీజ్ అయిన కొన్ని సినిమాలతో బాలీవుడ్ పోటీ పడలేకపోయింది. ముఖ్యంగా ప్రభాస్ డామినేషన్ ఓ రేంజ్ లో బాలీవుడ్ పై నడిచిన మాట వాస్తవం. ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్ లు, బాలీవుడ్ హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్ లు ఒకే విధంగా ఉండటం కూడా బాలీవుడ్ ను ఆశ్చర్యపరిచిన విషయం. ఇక అక్కడి నుంచి ప్రభాస్ ను టార్గెట్ చేసింది అనే అభిప్రాయాలు వినిపించాయి.

Also Read : సమంత–రాజ్‌ నిడిమోరు లవ్‌ స్టోరీ నిజమా?

ప్రభాస్ హీరోగా వచ్చిన ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ తెరకెక్కించడం.. ఆ సినిమా కామెడీగా ఉండటంతో ప్రభాస్ ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కీ సినిమాలు ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. ఇప్పుడు ది రాజాసాబ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. అయితే ఇప్పుడు బాలీవుడ్ అగ్ర నిర్మాతలు ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ.. రాజకీయం చేస్తున్నాయి అనే మాట వినపడుతోంది. ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ లను కేటాయించవద్దని ఇద్దరు ముగ్గురు అగ్ర నిర్మాతలు బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read : నా తండ్రికి ఆమె భార్య కాదు.. మాగంటి గోపీనాథ్ కొడుకు సంచలనం

దీని వెనుక ఓ స్టార్ హీరోయిన్ రాజకీయం చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి. ప్రభాస్ సినిమా నుంచి ఆ హీరోయిన్ ను పక్కన పెట్టడంతోనే ఆమె కక్ష సాధింపుగా వ్యవహరిస్తోంది అనే కామెంట్ బాలీవుడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. టాలీవుడ్ సినిమాలను కొందరు డిస్ట్రిబ్యూటర్ లు తక్కువకు కొని.. ఎక్కువ లాభాలు గడిస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళనే నిర్మాతలు టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కు వ్యతిరేకంగా అక్కడి మీడియా కథనాలు రాస్తోంది. సోషల్ మీడియాలో కూడా నెగటివ్ పబ్లిసిటీ పెంచేశారు. దీని వెనుక కూడా ఆ హీరోయిన్ ఉందనే టాక్ వస్తోంది. కల్కీ సినిమా తమ హీరోయిన్ కారణంగానే ఆడింది అనే ప్రచారం కూడా చేయడం మొదలుపెట్టింది అక్కడి మీడియా. ఇక ఇప్పుడు ప్రభాస్ ను ట్రోల్ చేయడమే కాకుండా సినిమా కొనే వాళ్ళను, థియేటర్ యజమానులను కూడా బెదిరించడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్