Thursday, May 7, 2026 03:24 AM
Thursday, May 7, 2026 03:24 AM

గంభీర్ కి చెక్ పెడుతున్న బోర్డ్..? షాకింగ్ నిర్ణయం..!

టీం ఇండియా హెడ్ కోచ్ గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సోషల్ మీడియాలో కాస్త విమర్శలు గట్టిగా వచ్చాయి. కొందరు ఆటగాళ్ళపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నాడు అనే విమర్శలు వచ్చాయి. మూడు ఫార్మాట్ లకు ముగ్గురు ఆటగాళ్లను కెప్టెన్ లను చేయాలని భావించాడని ప్రచారం జరిగింది. అనుకున్న విధంగానే రోహిత్ శర్మను కెప్టెన్ గా పక్కన పెట్టాడు. వన్డే కెప్టెన్సి పదవి నుంచి కూడా తప్పించే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.

Also Read : అసలు బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది..?

అలాగే జట్టు సెలెక్షన్ విషయంలో కూడా గంభీర్ పెత్తనం ఎక్కువగా ఉందనే వార్తలు వచ్చాయి. శ్రేయాస్ అయ్యర్ విషయంలో కూడా రాజకీయాలు జరిగినట్టు విమర్శలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారాలపై బోర్డు పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. ఇద్దరు, ముగ్గురు సీనియర్ ఆటగాళ్ళు కూడా గంభీర్ పెత్తనాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బోర్డుకు కంప్లైంట్ చేసినట్టు సమాచారం. దీనితోనే బోర్డు నష్ట నివారణ చర్యలకు దిగినట్టు వార్తలు వస్తున్నాయి. రాబోయే సీరీస్ లను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

Also Read : రేవంత్ గోప్యతకు కారణం అదేనా..?

ఎంఎస్ ధోనీని జట్టు మెంటార్ గా నియమించాలని భావిస్తోంది బోర్డు. గంభీర్ పెత్తనం తగ్గించాలి అంటే ధోని కరెక్ట్ అని భావిస్తోన్న బోర్డు పెద్దలు.. ఆసియా కప్ నుంచే ధోనీని మెంటార్ గా నియమించే దిశగా అడుగులు వేస్తోంది. అటు ధోనీ కూడా ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్టు సమాచారం. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన ఓ మాజీ క్రికెటర్ కు బోర్డు అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత గంభీర్ పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్ పర్యటనలో జట్టు ఎంపికపై కూడా బోర్డు సీరియస్ అయింది. ఇక తనకు నచ్చిన ఆటగాళ్లే తుది జట్టులో ఉంటున్నారనే ఆరోపణ వచ్చింది. కుల్దీప్ యాదవ్, అభిమన్యు ఈశ్వరన్ వంటి వారికి చోటు కల్పించకపోవడంపై బోర్డు సీరియస్ అయినట్టు సమాచారం. వీటిపై మీడియా కూడా ఫోకస్ చేయడంతోనే.. జట్టు జాగ్రత్తలు పడుతున్నట్టు క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్