Saturday, September 19, 2026 06:40 AM
Saturday, September 19, 2026 06:40 AM

పాకిస్తాన్ లో చరిత్ర సృష్టించిన హిందూ మహిళ

సాధారణంగా పాకిస్తాన్ లేదా ముస్లిం దేశాల్లో హిందువుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ లో హిందువులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. తాజాగా.. ఓ మహిళ చరిత్ర సృష్టించారు. పాకిస్తాన్‌కు చెందిన 25 ఏళ్ల హిందూ మహిళ కాశీష్ చౌదరి, బలూచిస్తాన్‌లో మైనారిటీ కమ్యూనిటీ నుండి అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులైన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని చాగై జిల్లాలోని నోష్కి అనే మారుమూల పట్టణానికి చెందిన కాశీష్, బలూచిస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అర్హత సాధించారు.

Also Read : ఏపీ లిక్కర్ స్కాం.. ఆధారాలన్నీ హైదరాబాద్ లోనే..?

సోమవారం, కాశీష్ తన తండ్రి గిర్ధారి లాల్‌తో కలిసి, బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తిని క్వెట్టాలో కలిసి నియామక పత్రాన్ని అందుకున్నారు. మహిళలు, మైనారిటీల సాధికారత, ప్రావిన్స్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఆమె. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ లో మైనార్టీ హిందువులు రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. పాకిస్తాన్‌లో పురుషాధిక్యత ఎక్కువ అనే ఆరోపణ ఉంటుంది. అలాంటి చోట.. హిందూ సమాజానికి చెందిన మహిళలు కీలక స్థానాల్లో బాధ్యతలు చేపడుతున్నారు.

Also Read : ప్రపంచ కప్ కష్టమే.. గవాస్కర్ సంచలన కామెంట్స్

సాంస్కృతిక, మతపరమైన, సామాజిక అడ్డంకులను అధిగమించి గణనీయమైన విజయాలను సాధిస్తున్నారు. జూలై 2022లో, మనేష్ రోపేటా అనే హిందూ మహిళ.. కరాచీలో పోలీస్ సూపరింటెండెంట్‌గా నియమితులైన మొదటి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. కరాచీలో పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ గా 35 ఏళ్ల పుష్ప కుమారి కోహ్లీ పని చేస్తున్నారు. 2019లో సింధ్ ప్రావిన్స్‌లోని తన స్వస్థలమైన షాహదాద్‌కోట్‌లో సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. సుమన్ పవన్ బోదాని ఇప్పటికీ హైదరాబాద్‌లో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నారు. పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమాజం. అధికారిక లెక్కల ప్రకారం, 75 లక్షల మంది హిందువులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. కానీ దేశంలో 90 లక్షలకు పైగా హిందువులు నివసిస్తున్నారని అక్కడి అధికారులు చెప్తున్నారు. సింద్ ప్రావిన్స్ లోనే వీరు ఎక్కువగా స్థిరపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్