Thursday, May 7, 2026 03:25 AM
Thursday, May 7, 2026 03:25 AM

ఆయుధం ఉన్నా వాడని టీం ఇండియా…!

ఐసీసీ టోర్నమెంట్లలో భారత్ ఫైనల్ వరకు వెళ్లడం.. అక్కడ బోల్తా పడటం.. ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయంలో ఇలాగే జరిగింది. అలాగే 2023 ప్రపంచ కప్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. 2024 టి20 వరల్డ్ కప్ లో ఓటమి అంచల వరకు వెళ్లి.. చివరకు విజయం సాధించారు. ఇక 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ వరకు వెళ్లినట్టే వెళ్లి వెనక్కి వచ్చింది భారత్. అయితే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇప్పుడు అభిమానులను కొన్ని భయాలు వెంటాడుతున్నాయి.

Also Read : ఆ రూల్ మార్చండి.. టీటీడీకి వినతులు..!

లీగ్ మ్యాచ్ లలో… సెమీఫైనల్ లో భారత్ విజయం సాధించినా.. ఫైనల్ విషయంలోనే అభిమానులకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. వరుస విజయాలతో సెమీఫైనల్ కు క్వాలిఫై అయినా.. భారత్ సెమి ఫైనల్లో.. విజయం సాధించినా.. ఫైనల్ పై మాత్రం అభిమానులకు నమ్మకాలు కనబడలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ కి వెళితే ఆ జట్టును ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై భారత్ కు ఒక వ్యూహం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. 2023లో రెండుసార్లు ఐసిసి టోర్నమెంట్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది.

Also Read : మార్చొద్దు.. ఏపీ బిజేపి చీఫ్ పై చంద్రబాబు ఒపినియన్…!

గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా భారత్ ఇలాగే చేతులెత్తేసింది. ఇక ఇప్పుడు కూడా పరిస్థితి అలాగే కనబడుతోంది. కీలక ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకుండా.. పదే పదే ఆడించిన జట్టునే ఆడించడంపై అభిమానులు సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లకు లెఫ్ట్ హ్యాండ్ పేసర్ వీక్నెస్ ఉంటుంది. దీనితో బౌలింగ్ విభాగంలో లెఫ్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం స్పిన్ బౌలింగ్ పైన భారత్ ఆధారపడుతోంది.

Also Read : ఆనాడు యరపతనేని ఒక్కడే నిలబడ్డాడు.. బాబు సంచలన కామెంట్స్

అర్షదీప్ సింగ్ లాంటి నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉన్నా సరే.. అతన్ని వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడగా ఇప్పటివరకు అర్షదీప్ సింగ్ కు అవకాశం రాలేదు. కనీసం న్యూజిలాండ్ తో జరగబోయే మ్యాచ్లో అయినా సరే.. అతనికి అవకాశం ఇచ్చి.. ఇక్కడి నుంచి నిలకడగా రాణిస్తే.. ఒకవేళ ఆస్ట్రేలియా ఫైనల్ కి వెళ్ళినా సరే.. లేదంటే సెమీఫైనల్ లో తలపడే పరిస్థితి వచ్చినా.. అతడి వల్ల ప్రయోజనం ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ భారత్ ను ఇబ్బంది పెడుతున్నాడు. అతనికి లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ ఉంది. దీంతో అతని విషయంలో అర్షదీప్ సింగ్ ను ప్రయోగిస్తే బాగుంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్