రాజకీయాలపై మీడియా ప్రభావం ఎక్కువ. ఛాన్స్ దొరికితే మీడియా వేటాడుతూ ఉంటుంది. కొన్ని మీడియా సంస్థలు అమ్ముడుపోయి కళ్ళకు గంతలు కట్టుకుంటే కొన్ని మాత్రం దుమ్ము రేపుతాయి. ఇప్పుడు జగన్ అండ్ కో ను నేషనల్ మీడియా ఇలాగే ఆడుకుంటుంది. తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీ చేసిన కార్యక్రమాలను ప్రముఖ చానల్స్ ఓ ఆట ఆడుకుంటున్నాయి. రిపబ్లిక్ ఛానల్ మొదలు దాదాపు రెండు మూడు చానల్స్ కథనాలు ప్రసారం చేస్తున్నాయి. డిబేట్ ల ద్వారా సైతం వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Also Read : పసి కూనలు కాదు.. డైనమైట్స్..!
కల్తీ వ్యవహారం అనేది ఒక ప్రాంతానికి చెందినది కాదు.. కొందరు వ్యక్తులకు సంబంధించినది కాదు.. కోట్లాది మంది భక్తులకు సంబంధించి, అంతర్జాతీయంగా ముడి పడి ఉన్న ఓ ఆధ్యాత్మిక సమస్య. ప్రపంచ దేశాలకు చెందిన కోట్లాది మంది శ్రీవారిపై నమ్మకంతో తిరుమల వస్తూ ఉంటారు. ప్రార్ధనలు, మొక్కులు, ఆచారాలు ఇలా ఎన్నో వ్యవహారాలూ ముడి పడి ఉన్నాయి. ఇప్పుడు ఈ అంశాన్నే జాతీయ మీడియా ప్రస్తావిస్తోంది. వైసీపీ సర్కార్ చేసిన పాపాన్ని ఎండగడుతుంది. తెలుగు మీడియా చేయలేని కార్యక్రమం చేస్తోంది.
Also Read : ఎగ్ వైట్ మంచిది కాదా..? మరి కోడిగుడ్డు ఎలా తినాలి..?
ఈ చానల్స్ ను ఫాలో అయ్యే వారు కూడా జాతీయ స్థాయిలో వైసీపీపై విమర్శలకు దిగారు. ఇటీవల జరిగిన డిబేట్ లో రిపబ్లిక్ ఛానల్ అధినేత అర్నబ్ గోస్వామి చేసిన కామెంట్స్ కూడా సంచలనం అయ్యాయి. ఈ వ్యవహారంలో సిట్ తేల్చిన అంశాలపై ఏ విషయాలు ప్రస్తావించాలో లాజికల్ గా అవే ప్రస్తావిస్తుంది. దీనితో వైసీపీ అనుకూల మీడియా కూడా సైలెంట్ అయిపోతుంది. ప్రతీదానికి ఎల్లో మీడియా అంటూ తిట్టిపోసే వైసీపీ సోషల్ మీడియా.. ఇప్పుడు మాత్రం ఒంటి కన్నుతో నేషనల్ మీడియాను చూస్తూ స్క్రోల్ చేస్తుంది. భావోద్వేగాల అంశాలను హైలెట్ చేసే విషయంలో నేషనల్ మీడియా దిట్ట. అందుకే మహా పాపాన్ని తూర్పారబోస్తున్నది.

