Wednesday, May 6, 2026 08:53 PM
Wednesday, May 6, 2026 08:53 PM

లిక్కర్ అక్రమార్కుల బెండు తీస్తున్న ఏపీ సిఐడి

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది. గత అయిదేళ్ళ నుంచి ఎవరికి మద్యం కాంట్రాక్ట్ లు ఇచ్చారు, ఏంటీ అనే దానిపై సర్కార్ సిఐడీ ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. మద్యం కుంభకోణంలో అక్రమాలు వెలికితీయడమే లక్ష్యంగా మంగళవారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఈ విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద… తాడేపల్లి ప్యాలెస్ తో సన్నిహితంగా ఉన్న వాళ్ళకే 90 శాతం ఆర్డర్లు ఇచ్చారు. వైసీపీ నేతలతో అధికారులు చేతులు కలిపి అధిక కమీషన్ ఇచ్చిన వారికి కాంట్రాక్ట్ ఇచ్చారు.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బినామీ కంపెనీకి ఎక్కువగా ఆర్డర్ లు ఇచ్చారు. టీడీపీ వారి డిస్టిలరీలు లాక్కున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి తయారి ప్లాంట్ లేకపోయినా ఆర్డర్ లు ఇచ్చేసారు. 90 శాతం ఆర్డర్ లు కేవలం 10 సంస్థలకే దక్కాయి అని గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి వరకు సాగాయి తనిఖీలు. కరకంబాడి లోని ఎస్వీఆర్ డిస్టలరీస్, మురుకంబట్టు లోని కృష్ణ ఎంటర్ప్రైజెస్ లో సోదాలు నిర్వహించారు.

Also Read : చెల్లితో రాజీ లేదు.. షర్మిల చీటర్

2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు డిస్టలరీస్ లో ఏఏ కంపెనీలకు ఏఏ రకాల మద్యం ఎంత పరిణామంలో తయారు చేశారనే వివరాలు సేకరించారు. నెలవారీగా తయారు చేసిన మద్యం ఎంత మేర సరఫరా చేశారు, మిగిలిన స్టాక్ ఏం చేశారన్న దానిపై విచారణ చేసారు. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఎక్కడి నుంచి తెప్పించారు, బ్లెండ్ ఎంత మోతాదులో కలిపారన్న దానిపై ఆరా తీసారు. డిస్టలరీస్ లో ఏ ఏ రకాల మద్యం తయారీకి అనుమతులు ఉన్నాయి, వాటికి అనుగుణంగానే తయారీ చేశారా లేక ఉల్లంఘన జరిగిందా ఆన్న వివరాలు కూడా సేకరించడం గమనార్హం.

5 ఏళ్ల కాలంలో మద్యం తయారీ విక్రయాల రికార్డులను పరిశీలించి వివరాలు సేకరించిన అధికారులు… మద్యం తయారీ వేస్టేజ్ ఎంత, దాన్నేమి చేశారు, ధ్వంసం చేశారా లేదంటే మళ్ళీ చీప్ కింద విక్రయించారా ఆన్న దానిపై ఆరా తీసారు. సిఐడి సోదాలు, ఎంక్వైరీ ని వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు…డిస్టలరీస్ లీజు అంశాలను కూడా తెలుసుకున్నారు. ముఖ్యంగా మిథున్ రెడ్డికి చెందిన తయారి ప్లాంట్ లపై అధికారులు ఫోకస్ చేసారు. త్వరలోనే ఈ అంశంలో కీలక అరెస్ట్ లు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్