Wednesday, April 1, 2026 02:20 AM
Wednesday, April 1, 2026 02:20 AM

బంగాళాఖాతంలో మరో తుఫాన్.. తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఉంటుందా..?

వరుస తుఫాన్ లు, అల్పపీడనాలతో భారత తీర ప్రాంతం వణికిపోతుంది. ఇటీవల వచ్చిన మొంతా తుఫాన్ దెబ్బకు దక్షిణ తీర ప్రాంతం మొత్తం వణికిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనపడింది. దీని కారణంగా రైతులు పెద్ద ఎత్తున నష్టపోగా.. తీర ప్రాంతాలతో సంబంధం లేని తెలంగాణాలో భారీ నష్టం జరిగింది. ఇక ఇప్పుడు మరో తుఫాన్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది.

Also Read : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు..!

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అండమాన్ మరియు నికోబార్ దీవులలో భారీ హెచ్చరికలు చేసారు. నవంబర్ 21 నుండి ఈ ఉపరితల ఆవర్తనం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని తెలిపింది. తుఫాను మరింత తీవ్రమైతే, దానికి ‘సెన్యార్’ అని పేరు పెట్టనున్నారు. దీని కారణంగా నికోబార్ ద్వీపంలో భారీ నుండి అతి భారీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. అండమాన్ ద్వీపంలో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండవచ్చు.

Also Read : రామ్ చరణ్ – ఉపాసనా ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే..?

అండమాన్ సముద్రంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటం, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. నవంబర్ 23 వరకు అండమాన్ సముద్రంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. పడవల యజమానులు, అక్కడ నివాసం ఉండే స్థానికులు జాగ్రత్తగా ఉండాలని, పర్యాటకులు దూరంగా ఉండాలని సూచించింది. దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు పెద్దగా ప్రభావం లేకపోయినా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు, దక్షిణ ప్రకాశం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న కాగ్...

కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై కంప్ట్రోలర్...

మెగా ఫ్యాన్స్ కు...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

ధర్నా వ్యవహారంపై సిఎం...

అమరావతిలో ఇటీవల గ్రామీణ నీటి సరఫరా...

అమరావతిలో కేటుగాళ్ళు.. స్పెషల్...

ఏపి రాజధాని అమరావతిలో జరుగుతున్న వరుస...

ఏపీలో ముగిసిన మావోల...

ఏపీలో మావోయిస్టుల ప్రాబల్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు...

నాయుడుపై వేటు.. కొత్తగా...

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి...

పోల్స్