Thursday, May 7, 2026 04:38 AM
Thursday, May 7, 2026 04:38 AM

అమిత్ షా టార్గెట్ సక్సెస్..?

దేశంలో మావోయిస్టు పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిన సంకేతాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేసిన తర్వాత భద్రత బలగాలు ఎక్కడికి అక్కడ మావోయిస్టుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటి ఎన్నో కార్యక్రమాలు మావోయిస్టుల విషయంలో దూకుడుగా ముందుకు వెళ్ళలేకపోయాయి. కానీ ఆపరేషన్ కగార్ మాత్రం మావోయిస్టుల ఏరివేతలో అత్యంత కీలకంగా పనిచేస్తోంది.

Also Read : ఎన్నికల రంగంలోకి నందమూరి వారసురాలు..!

భద్రత బలగాలకు అవసరమైన సాంకేతిక.. ఆయుధ సామాగ్రిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. నిధుల సమస్య కూడా లేకపోవడంతో.. భద్రత బలగాలు ఎప్పటికప్పుడు పై చేయి సాధిస్తున్నాయి. ఆపరేషన్ కగార్ మొదలుపెట్టిన తర్వాత మొత్తం 200 మందికిపైగా మావోయిస్టులను హతమార్చారు. భద్రత బలగాల వైపు ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగింది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా.. మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి ప్రాణాలకు కోల్పోయారు.

Also Read : జాతీయ స్థాయికి వైసీపీ.. సక్సెస్ అవుతుందా..?

సాయుధ కార్యక్రమాల్లో గాజర్ల రవి కీలకపాత్ర పోషిస్తూ ఉంటారు. 2004లో జరిగిన చర్చల సమయంలో కూడా గాజర్ల రవి ముందుండి నడిపించారు. ఇప్పటికే పలువురు కేంద్ర కమిటీ సభ్యులను కోల్పోయిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు.. రవిని కూడా కోల్పోవడంతో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశాలు కనబడుతున్నాయి. రవి మరణంతో ఏఓబి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లుగానే ఉంది. రవి కుటుంబం మొత్తం ఉద్యమంలోనే ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఇక ఆయనతోపాటుగా చలపతి భార్య అరుణ కూడా ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. మహిళా నాయకత్వంలో ఆమెది కీలకపాత్ర.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్