Wednesday, May 6, 2026 09:02 PM
Wednesday, May 6, 2026 09:02 PM

అమెరికా ‘డ్రాప్ బాక్స్’ వీసా నిబంధనలు మరింత కఠినం

అమెరికా వీసా రెన్యువల్‌ చేయాలనుకునే వారికి షాక్! వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకు ముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే వీసా అప్లికేషన్‌ కేంద్రాల్లో కొత్త రూల్స్​ను అమలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

Also Read: చింతమనేనిపై రాడ్లతో దాడి.. ఎమ్మెల్యే రియాక్షన్ ఇదే

తాజా నిబంధనలతో హెచ్‌-1బీ సహా బీ1/బీ2 వంటి నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా రెన్యువల్‌ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం గత 48 నెలల్లో వీసా గడువు ముగిసినవారు రెన్యువల్‌ కోసం డ్రాప్‌బాక్స్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు. అలాంటివారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఇప్పుడీ నిబంధనను మారుస్తూ గత 12 నెలల్లో వీసా గడువు ముగిసినవారికి మాత్రమే డ్రాప్‌బాక్స్‌లో రెన్యువల్‌ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటిన వారు రెన్యువల్‌ కోసం మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిందే అన్నమాట..!

Also Read: బూమ్రా లేడు.. భారం మొత్తం ఆ ఇద్దరిపైనే…!

కొవిడ్‌ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో ఈ ‘డ్రాప్‌బాక్స్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటినుంచి గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ట్రంప్‌ సర్కారు దీన్ని మళ్లీ పాత పద్ధతిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

Also Read: అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్.. మాజీ మంత్రులకు రూట్ మ్యాప్

వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన ‘డ్రాప్‌బాక్స్‌’ నిబంధనల మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్‌ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో బీ1/బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం 440 రోజులకు పైగా వేచి ఉంటున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువమంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. డ్రాప్‌బాక్స్‌పై ఆధారపడుతున్న బిజినెస్‌ ట్రావెలర్స్‌, వృత్తినిపుణులు వీసాల (హెచ్‌-1బీ) పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్