Saturday, September 19, 2026 11:32 PM
Saturday, September 19, 2026 11:32 PM

అఖండ 2 వస్తున్నాడు.. డేట్ ఫిక్స్…!

అఖండ 2.. ఈ ఏడాది నందమూరి అభిమానులనే కాదు.. సినీ ప్రేక్షకులను కూడా కాస్త నిరాశ పరిచిన సినిమా. ఇందుకు ఒకటే కారణం.. డిసెంబర్ 5వ తేదీన అఖండ 2 థియేటర్లలో తాండవం అంటూ దర్శక, నిర్మాతలు మొదటి నుంచి చెబుతున్నారు. దీంతో బాలయ్య అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. సినిమా రిలీజ్ రోజున థియేటర్ల దగ్గర సందడి చేశారు. తీరా రిలీజ్ ఆగిపోయిందనే వార్త బాలయ్య అభిమానులను కలచి వేసింది.

Also Read : అర్నాబ్.. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..?

అఖండ 2.. కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్ల మాత్రమే సినిమా విడుదల చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో మళ్లీ ఎప్పుడు వస్తుందా అని బాలయ్య అభిమానులతో పాటు సినిమా లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనూహ్యంగా అఖండ 2 వాయిదా పడటంతో.. గత శుక్రవారం ఒక్క తెలుగు సినిమా కూడా విడుదల కానీ వారంగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక అఖండ 2 గురించి ఇప్పటికే పుకార్లు షికారు చేస్తున్నాయి. సంక్రాంతి రేసులో ఉందని.. లేదు డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తుందనే ప్రచారం టాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లో కూడా బాగానే ఉంది.

Also Read : మళ్ళీ యాక్టివ్ అవుతోన్న అన్నలు..?

తాజాగా అఖండ 2 రిలీజ్‌ గురించి టాలీవుడ్ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఇష్యూలు క్లియర్ అయ్యాయని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 12న శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ప్రకటనను దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అఖండ 2 వాయిదా నేపథ్యంలో సినిమా డిస్ట్రిబ్యూటర్స్ హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సినిమా విడుదల ఆలస్యమైనందున కలెక్షన్లపై ప్రభావం ఉంటుందా.. అనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. సినిమా బాగుంటే.. ఎప్పుడు రిలీజ్ అయినా.. ప్రేక్షకులు చూస్తారని.. పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజుల్లోనే రెవెన్యూ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్