Sunday, June 21, 2026 03:56 AM
Sunday, June 21, 2026 03:56 AM

బ్రేకింగ్: తుని ఘటనలో నిందితుడు ఆత్మహత్య

గత రెండు రోజుల నుంచి అత్యంత సంచలనంగా మారిన తుని అత్యాచారయత్నం ఘటనకు సంబంధించి.. కీలక పరిణామం చోటు చేసుకుంది. సపోటా తోటలో ఓ చిన్నారిపై ఘటనకు పాల్పడే ప్రయత్నం చేసిన నారాయణ రావు అనే వ్యక్తి నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సపోటా తోటలోకి బాలికను తీసుకువెళ్ళి అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేయడం, తోట యజమాని వీడియో తీసి, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వెంటనే దీనిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Also Read : నా తండ్రికి ఆమె భార్య కాదు.. మాగంటి గోపీనాథ్ కొడుకు సంచలనం

ఈ క్రమంలోనే అతనిని తుని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే ప్రయత్నం చేయగా.. అతను చెరువులో దూకి తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ వెంటనే పోలీసులు గజ ఈతగాళ్ళను, డ్రోన్ లను రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు. అయినా సరే లాభం లేకపోయింది. ఇక నేడు ఉదయం అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాష్ రూమ్ కు వెళ్తాను అని చెప్పిన తర్వాత, పోలీసులు అనుమతి ఇవ్వడం, వర్షం పడటంతో పోలీసులు చెట్టు కింద ఉండటంతో ఇదే అదునుగా భావించి అతను పారిపోయే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

Also Read : దానం చుట్టూ మరో వివాదం..!

అయితే చెరువు పెద్దగా ఉండటంతో అతను ఈత కొట్టలేకపోయినట్లు తెలుస్తోంది. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్య ప్రయత్నం చేసి ఉండొచ్చు లేదా..? అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నామని స్థానిక పోలీసులు చెప్తున్నారు. ఇక అతని ఆత్మహత్యపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తన విషయంలో కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని భయపడే అతను ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్