Wednesday, February 4, 2026 07:22 PM
Wednesday, February 4, 2026 07:22 PM

హిందీలో ‘డాకూ మహారాజ్’ రచ్చ స్టార్ట్.. ఓటీటీలో అప్పుడే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన డాకు మహారాజ్ సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. బాలయ్య బాబు కెరీర్ లో వరుసగా నాలుగు సార్లు 100 కోట్ల వసూలు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది డాకూ మహారాజ్. బాబి కొల్లి డైరెక్షన్లో యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వర్క్ చేసిన ఈ సినిమా త్వరలోనే మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయిపోతుంది. శుక్రవారం నుంచి ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే తమిళంలో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సాధించింది.

Also Read: దిల్ రాజుకు రామ్ చరణ్ రిటర్న్ గిఫ్ట్

అక్కడ కూడా వసూళ్ళలో పరవాలేదు అనే టాక్ వచ్చింది. ఇక త్వరలోనే ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. భారీ ధరకు ఓటిటీ హక్కులను దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్. ఇక త్వరలోనే సినిమా స్ట్రీమింగ్ కు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హిందీ వర్షన్ కు కనీసం రెండు వారాల సమయం ఇచ్చి ఆ తర్వాత రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి 10 నుంచి డాకు మహారాజ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: రామ్‌చరణ్ కెరీర్‌ను నాశనం చేసిన శంకర్

ఇక ఈ సినిమా దాదాపు 190 కోట్లకు పైగానే వసూలు చేసింది. అయితే ఐటీ దాడుల కారణంగా నిర్మాతలు కలెక్షన్స్ పై పెద్దగా ఎనౌన్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నాలుగు రోజుల క్రితం ఈ సినిమా 156 కోట్లు వసూలు చేసినట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. అటు తమిళ వర్షన్ లో కూడా దాదాపుగా 8 నుంచి 10 కోట్లు వసూలు చేసే అవకాశాలు ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. హిందీలో మొదట్లో కాస్త నిదానంగా ఉన్నా.. రోజులు గడిచే కొద్దీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్