Saturday, September 13, 2025 02:00 AM
Saturday, September 13, 2025 02:00 AM
roots

బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటిఆర్..? కొత్త ఏడాది సంచలన మార్పులు…!

భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడి ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో అలాగే శాసనసభలో పెద్దగా కనబడని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశాలు కనబడుతున్నాయి. కేటీఆర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. తాజాగా కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. 2025 లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది అని… వచ్చేఏడాది మొత్తం భారత రాష్ట్ర సమితిలో కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

Also Read : గరికపాటికి రేవంత్ కీలక పదవి…!

గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని… సభ్యత్వం కొత్త కమిటీలు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని అలాగే జిల్లా కమిటీలు కూడా మారబోతున్నాయని ఆయన ప్రకటించారు. దీంతో కేటీఆర్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావుకు కేటీఆర్ బాధ్యతలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఏసీబీ అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులతో కేటీఆర్ ఇబ్బంది పడుతున్నారు. దాదాపు వారం రోజుల తర్వాత ఆయన నేడు బయటికి వచ్చారు.

Also Read : రేవంత్ మాటకు విలువ లేదా…?

అసలు ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ తప్పని తాము కోర్టులో పోరాడుతున్నామని అదే ఏసీబీ ఎఫ్ఐఆర్ తో ఈ డి కేసు నమోదు చేసిందని కోర్టులపై తనకు నమ్మకం ఉందని ఆయన కామెంట్ చేశారు. ఒకప్పుడు కేటీఆర్ ను వ్యతిరేకించిన పార్టీ సీనియర్ నేతలు అందరూ ప్రభుత్వం పై కేటీఆర్ చేస్తున్న పోరాటం చూసి ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేయాలనే అభిప్రాయాలను చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్