Wednesday, August 5, 2026 04:18 PM
Wednesday, August 5, 2026 04:18 PM

కేటిఆర్ మౌనం ఎందుకు…?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సినీ హీరో అల్లు అర్జున్ కు మధ్య వివాదం పెరగడంలో మాజీ మంత్రి కేటీఆర్ కీ రోల్ ప్లే చేసిన విషయం అందరికీ అవగాహన ఉంది. పదేపదే రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా అల్లు అర్జున్ సీఎం పేరు మర్చిపోయాడంటూ కామెంట్ చేయడం… దానిని మీడియాలో అలాగే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ చేయటం దానిపై కాస్త చర్చలు జరగటం… రేవంత్ రెడ్డిలో ఆగ్రహాన్ని మరింత పెంచిందని చెప్పాలి. అయితే తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం తర్వాత ఇప్పటివరకు కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు.

Also Read : దీనెవ్వ తగ్గెదే లే.. తెలుగోడి సత్తా..!

సోషల్ మీడియాలో కూడా ఆయన పోస్టులు పెట్టడం లేదు. ఈ వ్యవహారాన్ని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని భావించిన కేటీఆర్ శాసనసభలో ముఖ్యమంత్రి ప్రసంగం తర్వాత కనీసం ఒక్క ట్వీట్ కూడా చేసే సాహసం చేయలేదు. రేవంత్ రెడ్డి తో సినిమా ప్రముఖులు భేటీ తర్వాత కేటీఆర్ నుంచి ఏదైనా రియాక్షన్ ఉంటుందని చాలా మంది ఎదురు చూశారు. కానీ రియాక్ట్ అవటానికి ఆయన ఇష్టపడలేదు. వ్యవహారాన్ని పెద్దది చేసి ఈ విషయంలో భారత రాష్ట్ర సమితి ఎంతోకొంత లబ్ధి పొందాలని ప్రయత్నం చేసింది.

Also Read : ఏపీ బియ్యం దొంగలపై కొత్త సిట్.. జాగ్రత్త పడ్డ సర్కార్…!

అందుకే ఆ పార్టీ సోషల్ మీడియా కూడా పదేపదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు కూడా సైలెంట్ అయిపోయారు. ఎక్కడ ఈ వ్యవహారం గురించి మాట్లాడేందుకు ప్రయత్నం చేయలేదు. పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి ప్రసంగం తర్వాత ఆసుపత్రిలో ఉన్న చిన్నారిని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా కూడా సినిమా వాళ్లపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్