Wednesday, August 5, 2026 02:46 PM
Wednesday, August 5, 2026 02:46 PM

తప్పంతా వాళ్ళదే.. విచారణలో మౌనంగా అల్లు అర్జున్

సినీ హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు దాదాపు 3 గంటల పాటు విచారించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పాత్ర ఉందని భావించిన పోలీసులు నేడు ఉదయం ఆయనను విచారణకు పిలిచారు. ఇక విచారణలో కీలక ప్రశ్నలు అడిగారు పోలీసులు. అల్లు అర్జున్ ను 18 ప్రశ్నలు అడిగారు పోలీసులు. అల్లు అర్జున్ చెప్పే ప్రతి ఆన్సర్ ను వీడియో రికార్డ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ స్టేట్ మెంట్ వీడియో రికార్డ్ తో పాటు మరో వైపు టైపింగ్ కూడా చేయడం గమనార్హం.

సంధ్య ధియేటర్ లోపలికి వస్తున్న వీడియో, లోపల కూర్చున్న వీడియో, బయటకు వెళ్తున్న వీడియో లు అల్లు అర్జున్ కు పోలీసులు చూపించారు. వీడియోలు చూపించి ప్రశ్నలు అడగడంతో మౌనం వహించినట్టు తెలుస్తోంది. రేవతి మృతి పై పోలీసుల వద్ద విచారం వ్యక్తం చేస్తూ, తప్పు జరిగింది ఇలా జరుగుతుందని ఊహించలేదని సమాధానం చెప్పాడట. తన పీఆర్ టీమ్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలాంటి ఘటన జరిగి ఉండేది కాదని అల్లు అర్జున్ సమాధానం ఇచ్చాడు. 50 మందికి పైగా బౌన్సర్ లను పెట్టడం తప్పేనని అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు.

Also Read : అల్లు ఫ్యామిలీపై టాలీవుడ్ పెద్దల ఒత్తిడి..? అల్లు Vs దిల్ రాజు..!

ముందు సంధ్య థియేటర్ వద్ద సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయాలని పోలీసులు భావించారు. కాని వద్దని విరమించుకున్నారు. అందుకోసం ప్రత్యేక వాహనాలను కూడా సిద్దం చేసారు. ఇక అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పాడు బన్నీ. పలు కీలక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మీకు రేవతి మరణ వార్త తరువాత రోజు తెలిసిందా? అని పోలీసులు అడగగా… అవును.. నాకు తరువాత రోజే తెలిసిందని చెప్పాడు. ఏసీపీ, డీసీపీ మీకు ఆడిటోరియం లో కలిసారా? అని అడగగా వాళ్ళు ఎవరూ నన్ను కలవలేదు.. మీడియాకి నాపై అవాస్తవాలు ప్రచారం చేసారని పోలీసులపై ఆరోపణలు చేసినట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

జంతర్ మంతర్ నిరసనల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్...

బీసీలకు ఏపీ సర్కార్...

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతుల సామాజికవర్గాల భద్రత,...

కృష్ణా నదిని మింగేస్తున్నారా..?...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో కృష్ణానది...

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

పోల్స్