Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

కొడుకే కాదు కూతురిపై కూడా ఈడీ ఫోకస్…?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు సీరియస్ గా అడుగులు వేస్తోంది. మరోసారి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రివాల్ ను విచారించేందుకు రెడీ అయింది. ఇప్పటికే ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. దీనికి గవర్నర్ అనుమతి కూడా తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. త్వరలోనే ఆయనను విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయి బెయిల్ పై బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు మరోసారి అరెస్టు అయ్యే సూచనలు కనపడుతున్నాయి.

ఆయన సంగతి పక్కన పెడితే ఈ కేసులో ఉన్న నిందితులు అందరిని మరోసారి అదుపులోకి తీసుకునేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెడీ అవుతుంది. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. మరోసారి ఆమెను ఢిల్లీ పిలిపించే అవకాశాలు కనబడుతున్నాయి. లేదంటే ఈ డి అధికారులు హైదరాబాద్ వచ్చి ఈ కేసుని విచారించనున్నారట. ఒకవైపు కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం… అలాగే ఈ డి ఆయనపై కేసు నమోదు చేయడం వంటివి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన తరుణంలో కవితపై కూడా ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీని మానసికంగా దెబ్బతిస్తుంది.

Also Read : మద్యం రేట్లు తగ్గిద్దాం.. మరో 11 కంపెనీల ప్లాన్ ఇదే

అటు కేసీఆర్ కూడా బయటకు రాకపోవడంతో అసలు పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఆ పార్టీ నేతలకు అంతు పట్టని పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్ ను దాదాపుగా ఏసీబీ అధికారులు అరెస్టు చేయబోయారు. అయితే హైకోర్టు జోక్యంతో ఈ అరెస్టు పది రోజులు వాయిదా పడింది. కచ్చితంగా 10 రోజులు తర్వాత ఆయనను అరెస్టు చేయవచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే సమయంలో కవితకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వస్తే మాత్రం కచ్చితంగా ఆమె ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్