Wednesday, August 5, 2026 12:53 PM
Wednesday, August 5, 2026 12:53 PM

అర్షదీప్ ను పిలవండి… మెల్బోర్న్ లో ఈ మార్పులు చేయాల్సిందే

ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ఎట్టకేలకు డ్రాగా ముగించింది టీమిండియా. ఓడిపోతుంది అనే స్థితి నుంచి వరుణుడి సహకారంతో భారత మిడిల్ ఆర్డర్, అలాగే లోయర్ ఆర్డర్ భారత్ ను ఓటమి నుంచి తప్పించాయి. అయితే మెల్బోర్న్ లో జరగబోయే నాలుగో టెస్ట్ విషయంలో భారత జట్టు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం వినపడుతోంది. ముఖ్యంగా బౌలింగ్ విభాగం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఆస్ట్రేలియా నుంచి ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రేలియా నుంచి ఇతర ఆటగాళ్ల కంటే ట్రావిస్ హెడ్ మరింత ఇబ్బంది పెడుతున్నాడు. దీనితో అతన్ని ఎదుర్కొనేందుకు వ్యూహాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయం వినపడుతుంది. ప్రధానంగా అతనికి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ వీక్నెస్ ఉంది. ఈ విషయంలో వాస్తవం గ్రహించి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ ను టీం లోకి తీసుకోవాలని… పంజాబ్ యువ ఫేసర్ అర్షదీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకోకపోతే కచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని ఆస్ట్రేలియా పిచ్చలపై అతని బౌలింగ్ బాగుంటుందని మాజీలు అంటున్నారు.

Also Read : క్రికెట్ కు సైంటిస్ట్ గుడ్ బై… మిస్ యూ అశ్విన్

కాబట్టి అతన్ని ఆస్ట్రేలియా పిలవాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. అలాగే మహమ్మద్ సిరాజ్ ను కూడా పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని… మూడో టెస్టులలో అతను గొప్పగా ఏమి రాణించలేదని అలాగే బ్యాటింగ్ లో కూడా అవసరమైన సమయంలో అతను కనీసం 20 బంతులు కూడా ఆడలేక పోతున్నాడని… కాబట్టి పక్కన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. ఇక అవసరమైతే రోహిత్ శర్మ… నాలుగో టెస్ట్ లో పక్కకు తప్పుకుని యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని అభిమన్యు ఈశ్వరన్ ను తుది జట్టులోకి తీసుకుంటే మంచి ఫలితం ఉండే అవకాశం ఉందని మాజీలు అంటున్నారు.

నాలుగో టెస్ట్ అత్యంత కీలకం కాబట్టి ఈ విషయంలో భారత జట్టు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం ఆస్ట్రేలియా ఆ మ్యాచ్లో గెలవడం పెద్ద విషయమేమీ కాదు. మూడో మ్యాచ్ లో బయటపడటానికి భారత్ ప్రదర్శన కంటే వర్షం ఎక్కువగా సహకరించింది. యువ ఆటగాడు జైస్వాల్, సీనియర్ ఆటగాడు పంత్ బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని స్లెడ్జింగ్ పక్కన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్