Tuesday, August 4, 2026 09:36 PM
Tuesday, August 4, 2026 09:36 PM

మరో ఐపిఎస్ కు మూడిందా…?

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్ళ పాటు చెలరేగిపోయిన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు ఓ వైపు చెలరేగిపోతుంటే… వారికి చాలా మంది అధికారులు తమ సహకారం అందించారు. ఇక వైసీపీ నేతల ఆదేశాలతో చాలా మంది టీడీపీ నేతలను వేధించారు. కేసులు పెట్టె విషయంలో వెనుకా ముందు చూడకుండా వ్యవహరించారు కొందరు అధికారులు. ఉన్నతాధికారులు కూడా ఇదే ధోరణిలో కొనసాగారు. ఇప్పుడు వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

Also Read : ఎన్నాళ్లీ జాప్యం… ఎందుకీ ఆలస్యం…?

తాజాగా మరో అధికారిపై గురి పెట్టింది సర్కార్. వైకాపా అనుకూలంగా వ్యవహరించిన… సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్. సంజయ్ పై ఏసీబీ ఉచ్చు బిగించింది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇవ్వడంతో చర్యలకు దిగారు. నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశాలు ఇచ్చే అవకాశం కనపడుతోంది.

Also Read : ఢిల్లీ ఎన్నికల్లో గెలుపెవరిదీ…?

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ రాసారు. అనుమతి లభించిన వెంటనే.. ప్రాథమిక విచారణ చేయనుంది ఏసీబీ. విచారణ పూర్తి కాగానే కేసు నమోదు చేసే అవకాశం కనపడుతోంది. రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం జరిగిందని గుర్తించారు. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఆన్లైన్లో జారీ చేసారు సంజయ్. అగ్ని- ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్ల సరఫరా కాంట్రాక్ట్ విషయంలో అవినీతి జరిగినట్టు గుర్తించారు. విచారణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో పదిహేను రోజుల క్రితం సంజయ్ ని సస్పెండ్ చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్