Wednesday, May 6, 2026 08:12 PM
Wednesday, May 6, 2026 08:12 PM

ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్ ఉంటున్నారా..? ఇది చదివి డెసిషన్ తీసుకోండి…!

బరువు తగ్గడం అనేది చాలా మంది కల. ఎందుకు పెరుగుతున్నామో తెలియకుండా కొందరు పెరిగితే… ఇష్టం వచ్చినట్టు తిని బరువు పెరిగే వారు మరికొందరు. ఆ పెరిగిన బరువును కరిగించుకోవడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. జీవితంలో సక్సెస్ అంటే బరువు తగ్గడమే అనే రేంజ్ లో ప్రాణాలను పణంగా పెట్టి మరీ కష్టపడుతూ ఉంటారు. ఈ బరువు తగ్గడంలో చాలా రకాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది మాత్రం ఇంటర్మిట్టేంట్ ఫాస్టింగ్. అంటే రోజులో ఎక్కువ సమయం ఉపవాసం ఉండటం. మన రోజువారీ షెడ్యూల్ లో ఇది కీ రోల్ ప్లే చేస్తోంది.

Also Read: బన్నీతో టీడీపీకి గొడవలున్నాయా….?

కానీ.. కానీ.. కానీ ఇలా చేస్తే ఫ్యూచర్ లో బరువుతో పాటు కోల్పోయేవి చాలానే ఉన్నాయని పరిశోధనల్లో వెల్లడి అయింది. అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉందని గుర్తించారు. ముందు ఎలుకలపై దీనికి సంబంధించి పరిశోధన చేయగా… ఎక్కువగా జుట్టు ఊడిపోయిన విషయం గుర్తించారు. ఎలుకల్లో ఈ తీవ్రత ఎక్కువగా ఉన్నా మానవులలో కాస్త తక్కువగా ఉంటుందని.. కానీ ఊడిపోవడం పక్కా అని క్లారిటీ ఇచ్చారు. 30 రోజుల పాటు ఈ పరిశోధనలు నిర్వహించారు. సాధారణ ఆహారం తీసుకునే ఎలుకల జుట్టు పెరుగుదలకు భిన్నంగా… ఉపవాసం ఉన్న ఎలుకల జుట్టు పెరుగుదలలో చాలా తేడాలు ఉన్నాయని గుర్తించారు.

30 రోజుల్లో సాధారణ ఆహారం తినే ఎలుకల జుట్టు పెరిగితే అడపాదడపా తినే ఎలుకల జుట్టు 96 రోజుల వరకు పెరగడం లేదని గుర్తించారు. ఆహారం తీసుకోకపోవడం వలన శక్తిలో వచ్చే మార్పులతో జుట్టు రాలిపోతుందని గుర్తించారు. చైనాలోని వెస్ట్‌లేక్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టెమ్ సెల్ బయాలజిస్ట్ బింగ్ జాంగ్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. రోజులో ఎక్కువ గంటలు ఉపవాసం హెయిర్ ఫోలికల్ స్టెమ్ సెల్స్ ను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. ఈ కణాలు జుట్టు పునరుత్పత్తికి ప్రధాన కారణం.

Also Read: తెలుగు సినీ పరిశ్రమకు అవార్డు శాపమా…!

ఇవి శక్తి కోసం గ్లూకోజ్‌పై ఎక్కువగా ఆధారపడతాయి. మనం అడపాదడపా ఉపవాసం ఉంటే… ఆహారం తినడం తగ్గుతుంది. అప్పుడు మన శరీరం సాధారణ గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వును తన శక్తి వనరుగా ఉపయోగించుకుంటుంది. కొవ్వు ఆమ్లాలను రక్తప్రవాహంలోకి విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఆ కణాలకు ఈ కొవ్వు ఆమ్లాలను ప్రాసెస్ చేయడానికి అవసరమైన యంత్రాంగాలను కలిగి లేవని గుర్తించారు. దీనితో జుట్టు రాలిపోయే ఛాన్స్ ఉందని తేలింది. యాంటీఆక్సిడెంట్లు తీసుకుంటే ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు అని… విటమిన్ ఇ సమయానికి అందితే… యాంటీఆక్సిడెంట్ స్థాయి పెరగడానికి సహాయ పడుతుందని పేర్కొన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్