Wednesday, May 6, 2026 11:48 PM
Wednesday, May 6, 2026 11:48 PM

టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్దమైన వాసిరెడ్డి

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వైసీపీకి ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ ఎంపీలు అలాగే ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాగా మరికొందరు బిజెపిలో అలాగే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. త్వరలోనే ఆ పార్టీ నుంచి మరికొన్ని చేరికలు కూటమి పార్టీలలో ఉండే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ తరుణంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కూడా వైసీపీకి రాజీనామా చేసారు.

Also Read : అక్రమ దందా.. ఎస్పీపైనే అనుమానాలు అన్నీ…?

రాజీనామా చేసిన సందర్భంగా ఆమె జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. జగన్ మానసిక పరిస్థితి గురించి, ఆయన చేసే రాజకీయం గురించి గత ప్రభుత్వ పాలన గురించి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె విజయవాడ ఎంపీ కేసినేని చిన్నిని కలిసి పార్టీలో చేరికపై చర్చించారు. తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆమె ముందు నుంచి ఆసక్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read :అల్లు అర్జున్ కు వైసీపీ బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసింది

అయితే ప్రస్తుతం తనకు పార్టీలో పదవులు ఏమీ వద్దని ఎటువంటి అభ్యర్ధనలు లేకుండానే పార్టీలో జాయిన్ అవుతానని ఆమె చెప్పినట్లుగా సమాచారం. కేసినేని చిన్ని వద్ద ఇదే విషయాలను వాసిరెడ్డి పద్మ ప్రస్తావించారు. అలాగే తనతో పాటుగా మరో మహిళ నేత కూడా పార్టీ మారెందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఎప్పుడు జాయిన్ అవుతారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాసిరెడ్డి పద్మ విషయంలో పెద్దగా ఆగ్రహంగా లేరు. మరికొందరు కార్యకర్తలు ఆమె తెలుగుదేశం పార్టీలోకి వస్తే అధికార ప్రతినిధిగా అవకాశం కల్పించాలి అంటూ పార్టీకి సూచనలు కూడా ఇస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్