Wednesday, May 6, 2026 10:04 PM
Wednesday, May 6, 2026 10:04 PM

ఫస్ట్ డే పుష్ప 2 రికార్డుల జాతర

ఇండియా వైడ్ గా పుష్ప 2 సినిమా దుమ్ము రేపుతోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు పుష్ప. ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా వసూళ్లు మాత్రం ఆగలేదు. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా… డిసెంబర్ 4 సాయంత్రం నుంచే ప్రీమియర్లు స్టార్ట్ చేసారు. తొలిరోజు తెలుగు, హిందీ భాషల్లో 50 కోట్ల నికర వసూళ్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన ‘పుష్ప 2: ది రూల్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొద‌టిరోజు నుంచే రికార్డుల వేట షురూ చేసింది.

Also Read :ఏపీలో విమానాశ్రయాలకు కొత్త కళ

ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. గతంలో రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ఈ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్త నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వం వహించిన మొదటిరోజు రూ.175.1 కోట్ల వసూళ్లు సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ పేరిట ఉన్న అత్య‌ధిక‌ తొలిరోజు వసూళ్ల (రూ. 133 కోట్లు)ను ‘పుష్ప-2’ బ్రేక్ చేసింది. తొలిరోజు కలెక్షన్లు ఎక్కువగా తెలుగు నుంచే వచ్చాయి. తెలుగులో ఏకంగా రూ.95.1 కోట్లు రాబట్టింది పుష్ప2.

Also Read :కాంగ్రెస్‌ ఏడాది పాలన.. ఓల్డ్‌ సిటీకి గుడ్‌ న్యూస్‌..!

అలాగే హిందీ వెర్షన్ రూ.67 కోట్లు వ‌సూలు చేసింది. ఇక తమిళంలో రూ. 7 కోట్లు, కన్నడలో రూ. 1 కోటి, మలయాళంలో రూ. 5 కోట్లు రాబ‌ట్టింది పుష్ప ది రూల్. ఈ వీకెండ్ లో రూ. 250 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వ‌ర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమాకు తెలుగు కంటే నార్త్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. జాతర సీన్ కోసమే థియేటర్ కు క్యూ కడుతున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్