Wednesday, August 5, 2026 08:40 AM
Wednesday, August 5, 2026 08:40 AM

చంద్రబాబు వద్దకు చేరిన బూడిద పంచాయితీ

ఓ వైపు ప్రభుత్వ పెద్దలు పరిపాలనా సమస్యలతో తల మునకలు అవుతుంటే… అధికార పార్టీల ఎమ్మెల్యేల వైఖరి తీవ్ర వివాదాస్పదం అవుతోంది. వ్యక్తిగత పేరుతో సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారారు ఎమ్మెల్యేలు. జేసి కుటుంబానికి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మధ్య ఇప్పుడు బూడిద యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. సీఎం చంద్రబాబు స్వయంగా హెచ్చరించినా సరే ఇద్దరిలో మార్పు రావడం లేదు. బొందలదిన్నె అనే గ్రామం వేదికగా ఇద్దరి మధ్య బూడిద యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది.

Also Read : అడ్డంగా దొరికిన వెంకటరామిరెడ్డి.. ఇంకా మర్యాదలు చేస్తారా?

ఇక వైఎస్సార్ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపు వివాదం పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక అడుగులు వేసారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి పురపాలక అధ్యక్షుడు జేసీ ప్రభాకర్రెడ్డి, జమ్మలమడుగు తెదేపా ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి లకు సీఎంఓ నుంచి సమన్లు జారీ చేసారు. ఈరోజు సీఎం ను కలవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం రోజు రోజుకు పెద్దది అవుతోంది.

Also Read :టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మాజీ ఎంపీ..?

వాటాల్లో తేడా నేపద్యంలో బూడిదను వాహనాల్లో నింపకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడం వివాదం అయింది. ఆదినారాయణరెడ్డి వర్గీయుల బూడిద లారీలు తాడిపత్రి రాకుండా జేసీ ప్రభాకర్రెడ్డి వర్గం అడ్డుకుంటుంది. ఈ వివాదం ముదిరి ఆర్టీపీపీ వద్ద యుద్ధ వాతావరణంతో పాటు రెండు పోలీసు స్టేషన్ ల పరిదిలో 144 సేక్షన్ విధించడం తో సీ ఎం ఓ సీరియస్ అయింది. దీనితో ఆయా నేతలు వచ్చి చంద్రబాబును కలవాలి అని ఆదేశించారు. మరి వీరి పంచాయితీకి ఇక్కడైనా తెరపడుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్