Wednesday, September 23, 2026 12:17 PM
Wednesday, September 23, 2026 12:17 PM

గనుల వెంకటరెడ్డికి జైల్లో స్పెషల్ టీవీ, రిఫ్రిజిరేటర్?

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నా… వారి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. వైసీపీ నేతలని అరెస్ట్ చేసిన అనంతరం వారికి చేస్తున్న సేవలపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్ళిన అధికారులకు కూడా ఇలాగే సేవలు చేస్తున్నారు. గనుల ఘనుడు వెంకటరెడ్డికి విజయవాడ జైల్లో సకల మర్యాదల చేయడం పై విచారణకు జిల్లా శాఖా ఆదేశించింది. సహజ సంపద దోపిడీ వ్యవహారంలో ఏసీబీ అరెస్టు చేసిన మైనింగ్ మాజీ డైరెక్టర్ కు జైలు అధికారులు టీవీ, రిఫ్రిజరేటర్ వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసారు.

Also Read : టార్గెట్ వంశీ.. ముహూర్తం ఫైనల్

ఇటీవలే బెయిలుపై విడుదలైన వెంకటరెడ్డిపై విజయవాడ జైలు అధికారులకు అంత ప్రేమ ఎందుకు అనే అనుమానాలు మొదలయ్యాయి. వ్యవహారంపై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ (ఇన్చార్జి డీజీ ప్రిజన్స్) విచారణకు ఆదేశించడంతో జైలు అధికారుల వెన్నులో వణుకు మొదలయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించగా… కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు వేల కోట్ల కుంభకోణంలో కీలక సూత్రధారి అయిన వెంకటరెడ్డిని గత నెలలో హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడ కోర్టులో హాజరు పరిచారు.

Also Read : రోహిత్ Vs రాహుల్.. ఓపెనింగ్ స్థానం ఎవరికి?

వెంకటరెడ్డి జైల్లో ఉన్న సమయంలో గత నెల 11న టీవీ, రిఫ్రిజిరేటర్ విజయవాడ జైలుకు తరలించారు. తాజాగా విషయం వెలుగులోకి రావడంతో వెంకటరెడ్డి తన కోసమే వాటిని తెప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జైళ్లలో ఖైదీల కోసం దాతలు విరాళంగా ఇలాంటివి ఇస్తుంటారని, అధికారికంగా వాటిని తీసుకుని పై అధికారులకు ర్యాటిఫికేషన్ కు పంపుతామని జైళ్ల శాఖ అధికారులు చెప్తున్నారు. విజయవాడ జైలుకు వచ్చిన టీవీని కూడా గుంటూరు జిల్లాలో రెండు పెట్రోలు బంకులు ఏర్పాటు చేసిన హెచ్పీసీఎల్ కాంట్రాక్టరు ఇచ్చారని చెప్పినట్టు సమాచారం. ఆ టీవీని బ్యారక్ లో పెట్టాం తప్ప వెంకటరెడ్డి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయలేదనీ సమాధానం ఇచ్చారు. ఈ విషయమై హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ విచారణకి ఆదేశాలు ఇచ్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై...

విజయవాడ నగరంలో తీవ్ర కలకలం రేపిన...

అమరావతికి క్యూ కడుతున్న...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి...

టీచర్లపై దాడిలో అరాచక...

విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...

జగన్‌కు ఊహించని షాక్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

టాలీవుడ్ కు ఏపీ...

తెలుగు చలనచిత్ర మరియు టెలివిజన్ రంగాలకు...

తప్పు చేసి కొత్త...

బెజవాడలో టీచర్లపై చేసిన దాడిని, తాము...

పోల్స్