Wednesday, May 6, 2026 11:57 PM
Wednesday, May 6, 2026 11:57 PM

రోహిత్ Vs రాహుల్.. ఓపెనింగ్ స్థానం ఎవరికి?

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సీరీస్ రసవత్తరంగా మారింది. కివీస్ పై భారీ ఓటమి తర్వాత ఆస్ట్రేలియా పర్యటన లో ఇండియాపై ప్రేక్షకుల్లో ఏ మాత్రం అంచనాలు లేవు. ఆ స్థాయిలో పెర్త్ టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ కొడుతుందని ఎవరూ అంచనా కూడా వేయలేదు. కాని దుమ్ము రేపి చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది భారత జట్టు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోయినా బూమ్రా సారధ్యంలో చిరకాల విజయాన్ని సాధించింది. దీనితో రెండో టెస్ట్ కు జట్టు కూర్పు ఎలా ఉంటుంది అనే దానిపై భారత క్రికెట్ అభిమానులు, అనలిస్ట్ లు చాలానే అంచనాలు వేస్తున్నారు.

Also Read : ఏపీ రాజ్యసభ అభ్యర్ధులు ఫైనల్ అయినట్లే…?

ముఖ్యంగా ఓపెనర్, మూడో స్థానంలో ఎవరు వస్తారు అనేది క్లారిటీ రావడం లేదు. మొదటి టెస్ట్ కు రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి… కెఎల్ రాహుల్ ను ఓపెనర్ గా పంపించారు. కానీ రాహుల్ నుంచి ఆ రేంజ్ లో ప్రదర్శన ఎవరూ ఊహించలేదు. రాహుల్ మొదటి టెస్ట్ లో సరైన ప్రదర్శన చేయకపోయి ఉంటే ఆ స్థానంలో రోహిత్ వచ్చి ఉండేవాడు… రాహుల్ ను పక్కన పెట్టేవారు. కానీ కొత్త బంతిని రాహుల్ చాలా అందంగా ఎదుర్కొన్నాడు. ఫాస్ట్ పిచ్ లపై తనకు ఉన్న అనుభవం ఏ రేంజ్ లో ఉందో చూపించాడు. తన టెక్నీక్ తో జైస్వాల్ తో కలిసి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు.

Also Read : టార్గెట్ వంశీ.. ముహూర్తం ఫైనల్

దీనితో జైస్వాల్ కు తోడుగా రాహుల్ ను పంపడమే కరెక్ట్ అనే అభిప్రాయం ఎక్కువమంది నుంచి వినపడుతోంది. అనవసరంగా రాహుల్ ను మళ్ళీ 5 వ స్థానంలో పంపి రిస్క్ చేయవద్దని కోరుతున్నారు అభిమానులు. రోహిత్ అవసరమైతే గిల్ ఎలాగూ ఆడటం లేదు కాబట్టి… ఆ స్థానంలో ఆడాలని… లేదంటే గిల్ ఆడితే జురెల్ ను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. రాహుల్ ను దాదాపుగా ఓపెనర్ గానే పంపాలని కోచ్ గంభీర్ కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. గంభీర్ తన వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియా నుంచి భారత్ కు రావడంతో, ఈ స్థానం పై ఇంకా స్పష్టత రాలేదు. అయితే టెస్ట్ ప్రారంభానికి ముందే గంభీర్ జట్టుతో కలవనున్నారు. గంభీర్ జట్టుతో చేరగానే ఓపెనర్ స్థానం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్