Wednesday, February 4, 2026 09:49 PM
Wednesday, February 4, 2026 09:49 PM

పాపం పండుతోంది… సోషల్ మీడియా తిత్తి తీస్తున్నారా..?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో చెలరేగిపోతున్న వారిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఆడ మగ, తల్లి, చెల్లి అనే తేడా లేకుండా చెలరేగిపోతున్న సోషల్ మృగాలపై ఇప్పుడు సీరియస్ గా అడుగులు పడుతున్నాయి. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడుస్తున్నా సోషల్ మీడియా విషయంలో చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు, ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్, హోం మంత్రి అనిత వీటిపై సీరియస్ కావడంతో చర్యలకు రంగం సిద్దం చేసింది. ఇప్పటి వరకు తప్పించుకున్న వాళ్ళను వెంటాడుతున్నారు.

Also Read : ఇప్పుడు ఆ అధికారిని ఏం చేస్తారో…?

సోషల్ మీడియా పై యుద్ధం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం… సోషల్ మీడియా సైకో లను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించిన నేపధ్యంలో… ప్రభుత్వాన్ని, ప్రభుత్వంలో కీలక వ్యక్తులపై అడ్డగోలుగా పోస్ట్ లు పెట్టేవారు సప్తసముద్రాల అవల దాక్కున్నా తీసుకొస్తామని స్పష్టం చేసారు. అడ్డగోలుగా పోస్టులు పెట్టే వారి అరెస్టు లు కొనసాగుతాయని స్పష్టం చేయడంతో పోలీసులు సీరియస్ గా చర్యలకు రంగం సిద్దం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురికి BNSS 179 కింద నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమించి సోషల్ మీడియా పోస్ట్ లపై ప్రత్యేక నిఘా పెట్టారు.

Also Read : ఏమిటీ మురుగు.. శంకరా…!

సుమారు 15 వేల మంది వరకు ఆక్టివిస్ట్ లను గుర్తించినట్టు తెలుస్తోంది. అవసరమైతే లుక్ ఔట్ నోటీసు లు ఇచ్చైనా నియంత్రిస్తామని హోం శాఖ హెచ్చరిస్తోంది. అమెరికాలో ఉండి రెచ్చిపోతున్న పంచ్ ప్రభాకర్ పై కేసు నమోదు చేసారు ఇప్పటికే. అలాగే లండన్ లో ఉండి రెచ్చిపోతున్న మరో ఇద్దరు ముగ్గురిపై కూడా చర్యలకు సిద్దమయ్యారు. వైసీపీ నేతలు కాపాడాలి అనుకుంటే వారి విషయంలో కూడా ఇప్పుడు సీరియస్ గానే ఉన్నారు. కాపాడాలనే వారి బాగోతం కూడా బయటకు లాగి అరెస్ట్ లు చేయడానికి సిద్దమయ్యారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ఏదైనా మాట్లాడొచ్చు, ఎవరినైనా దూషించవచ్చు అనే భ్రమలో ఉన్న వైసీపీ సోషల్ మీడియా టీం సభ్యులకి ఇక కష్టకాలం తప్పకపోవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్