Wednesday, February 4, 2026 07:49 PM
Wednesday, February 4, 2026 07:49 PM

సత్తా చాటిన సౌత్ సినిమా.. వీళ్ళే దీపావళి విన్నర్స్

గత కొన్నాళ్ళుగా వరల్డ్ సినిమాలో సౌత్ ఇండియన్ సినిమా సత్తా చాటుతోంది. మూస కథలతో బాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలు చేస్తూ ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న సమయంలో సౌత్ నుంచి చాలా మంచి సినిమాలు వస్తున్నాయి. దీపావళికి మన సౌత్ నుంచి మూడు ఫేమస్ సినిమాలు విడుదల కాగా మూడూ విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వచ్చిన క, లక్కీ భాస్కర్ సినిమాలు, తమిళంలో విడుదలైన అమరన్ సినిమా మంచి హిట్ కొట్టాయి. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాయి.

దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. మధ్య తరగతి బ్యాంకు ఉద్యోగి పడే కష్టాలను చాలా బాగా చూపించారు. 1990 ల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ ను షేక్ చేసిన ఓ ఉదంతం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మెప్పించింది. భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది ఈ సినిమా. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన క సినిమా కూడా అంచనాలను అందుకుంది. తెలుగులో అసలు ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్ లో సినిమా విడుదల కాలేదు. అందుకే ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి.

Also Read : కెన్యా మృగాల మధ్యన జక్కన్న

పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం రిలీజ్ చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో ఈ యువ హీరో రేంజ్ పెరిగినట్టే. ఇక శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన అమరన్ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించింది. కార్గిల్ యుద్దంలో ప్రాణాలు అర్పించిన వీర మేజర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాలో ఓ సైనికుడి కష్టాలు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా చాలా బాగా చూపించారు. ఇలా ఈ మూడు సినిమాలు దీపావళి కానుకగా ప్రేక్షకులను అలరించాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్