Wednesday, February 4, 2026 09:59 PM
Wednesday, February 4, 2026 09:59 PM

అరెస్ట్ భయం స్పష్టంగా…?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లో అరెస్ట్ భయం స్పష్టంగా కనపడుతోంది అంటున్నాయి తెలంగాణా రాజకీయ వర్గాలు. తాజాగా ఆయన ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్ దీనికి కారణం అంటున్నాయి. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ సహా మరో మూడు కీలక కేసుల్లో ఖచ్చితంగా కేటిఆర్ ను అరెస్ట్ చేయవచ్చనే వార్తలు గత కొన్నాళ్ళుగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి… తెలంగాణాలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని ప్రకటన చేసారు. ఆ తర్వాత జన్వాడ ఫాం హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో కేటిఆర్ ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే కేటిఆర్ మాత్రం అది ఫ్యామిలీ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసారు. ఆ వ్యవహారం పక్కన పెడితే… ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేటిఆర్ కు ఉచ్చు ఇప్పటికే బిగిసింది అని సమాచారం. కేంద్ర ప్రభుత్వానికి కూడా సిఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో పక్కా ఆధారాలను తెలంగాణా సిఐడీ ద్వారా పంపారని తెలుస్తోంది. ఇదే విషయం పై మీడియా వర్గాల్లో ఇప్పుడు ఓ వార్త చక్కర్లు కొడుతోంది… ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్పోర్ట్ రద్దు వెనుక కేంద్ర సహకారం ఉందట.

Also Read : గతం మర్చిపోయావా కేటీఆర్..?

అలాగే కాళేశ్వరం కమీషన్ లో కూడా కేటిఆర్, కేసీఆర్ పాత్రను ప్రధానంగా గుర్తించిందని… ఓ కీలక కాంట్రాక్టర్ కు కూడా ఉచ్చు బిగించారట. ఈ విషయంలోనే కేటిఆర్ లో భయం మొదలయ్యి… బీఆర్ఎస్ సోషల్ మీడియాను అలెర్ట్ చేసి ఉండవచ్చు అంటున్నాయి. తన అరెస్ట్ జరిగితే ఖచ్చితంగా కుట్ర అనే విధంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ఇప్పటికే ప్లాన్ కూడా సిద్దం చేసారు. ఇప్పటికే హైదరాబాద్ లో 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కేటిఆర్ అరెస్ట్ కావడం ఖాయం అనే భావన కలుగుతోంది. నవంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్ లో ఆంక్షలు పెట్టడం చూస్తుంటే… ఈ లోపే అరెస్ట్ జరిగే అవకాశం ఉంటుంది ఆశించవచ్చు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్