Thursday, February 5, 2026 06:58 AM
Thursday, February 5, 2026 06:58 AM

చంద్రబాబు వద్దకు టీ బిజెపి లీడర్స్…?

తెలంగాణాలో రాజకీయంగా ఇప్పుడు బిజెపి దూకుడు పెంచుతోంది. తెలుగుదేశం సహకారంతో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముగ్గురు టీడీపీలో జాయిన్ కావడం వెనుక బిజెపి హస్తం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. త్వరలోనే మరికొందరు కూడా చేరే అవకాశం ఉందని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి స్పష్టం చేసారు. అయితే ఇటీవల చంద్రబాబు హర్యానా, ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన సమయంలో తెలంగాణాలో కూడా బిజెపి, టిడిపి, జనసేన పొత్తుపై చర్చ జరిగిందట.

మొత్తం 40 స్థానాల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. ఎన్నికలకు నాలుగేళ్ల ముందే దీనిపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో టీడీపీ బరిలోకి దిగే ఛాన్స్ కనపడుతోంది. ఇక్కడే మెజారిటీ స్థానాలు టీడీపీ తీసుకునే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ లో కూడా టీడీపీకి క్షేత్ర స్థాయి పట్టు ఉంది. హైదరాబాద్ లో దాదాపు ప్రతీ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు బిజెపి… టీడీపీని దూరం పెట్టడానికి సిద్దపడటం లేదు.

Also Read : బీఆర్ఎస్ పని అయిపోయిందా?

ఇక్కడ జనసేనతో పొత్తుపై మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అసలు తెలంగాణాలో జనసేన ఓ రాజకీయ పార్టీగా బలమైన కార్యక్రమాలు ఏవీ చేయలేదు. ఈ తరుణంలో తెలంగాణా బిజెపి నాయకులు త్వరలోనే అమరావతి రానున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పొత్తు కూడా ఖరారు చేసుకుని… ఇప్పటి నుంచే వర్క్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. చంద్రబాబు వద్దకు తమ ప్రతిపాదనలు తీసుకు రానున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి పోటీ చేస్తుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. దీనితో నాయకులు పని చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి అంటే ఖచ్చితంగా సీట్ల విషయంలో ఇప్పటి నుంచే క్లారిటీ ఉంటే ఇబ్బంది ఉండదు. గ్రేటర్ లో కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్