Wednesday, August 5, 2026 11:53 AM
Wednesday, August 5, 2026 11:53 AM

అచ్చెన్న… ఎందుకన్నా ఇలా..?

కింజరాపు అచ్చెన్నాయుడు అంటే చాలు వైసీపీ ప్రభుత్వ బాధితుడు అనే మాట వినిపిస్తుంది. 2014-19 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు… వైసీపీ హవాలో కూడా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో జగన్ సర్కార్ అచ్చెన్నను టార్గెట్ చేసింది. కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ ఆసుపత్రిలో కుంభకోణం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేశారు. అంతటితో ఆగకుండా కరోనా ఫస్ట్ వేవ్ లోనే అచ్చెన్నకు చుక్కలు చూపించారు.

ఓ వైపు పైల్స్ ఆపరేషన్ చేసుకున్నానని చెప్పినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా కారులోనే 500 కిలోమీటర్లు ప్రయాణం చేయించారు. దీంతో నాటి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్న… మీ సంగతి చూస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నాడు. బాబాయ్, అబ్బాయిలు టీడీపీలో కీలకంగా మారడంతో ప్రస్తుతం వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీడీపీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు.

Also Read : నందిగం సురేష్ ను వెంటాడుతున్న పాత పాపాలు..!

కళా వెంకట్రావు, కోండ్రు మురళీ, కూన రవికుమార్, గుండ అప్పల సూర్యనారాయణ, గౌతు శివాజీ, బెందాళం అశోక్, కలమట వెంకట రమణలు జిల్లాలో గుర్తింపున్న నేతలు. వీళ్లలో గౌతు, కళా లకు మాత్రమే అచ్చెన్న భయపడతాడనే టాక్ ఉంది. అందుకే ఎచ్చెర్ల టికెట్ కళాకు కాకుండా బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావుకు వచ్చేలా అచ్చెన్న పావులు కదిపాడనేది బహిరంగ రహస్యం. ఇక గెలిచిన తర్వాత జిల్లాలో అచ్చెన్న పెత్తనం ఎక్కువైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీలు, పోస్టింగ్, వైన్ షాప్ టెండర్.. ఇలా ప్రతి విషయం కూడా తన కంట్రోల్ లోనే ఉండాలని అచ్చెన్న హుకుం జారీ చేశారట.

ఒక్క పలాస నియోజకవర్గం విషయం తప్ప పార్లమెంటు పరిధిలోని మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో I am the Boss అని ఆదేశించారట. ఏ చిన్న పని కావాలన్నా సరే.. అచ్చెన్న దగ్గరికి వెళ్లాలని.. ఆయన సిఫారసు లేనిదే ఏ పని జరగదని అధికారులు కూడా చెబుతున్నారట. దీంతో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్న… ఎందుకిలా పెత్తనం అనే మాట వినిపిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మళ్లీ వైసీపీలోకి విజయసాయిరెడ్డి..?...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం...

నవంబర్ వరకు నో...

తెలంగాణ స్థానిక సంస్థల పోరు కోసం...

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

పోల్స్