Wednesday, February 4, 2026 08:05 PM
Wednesday, February 4, 2026 08:05 PM

వీరికి టీడీపీ పై ప్రేమా లేక హైడ్రా అంటే భయమా..?

ఏ మాటకు ఆ మాట తెలంగాణాలో హైడ్రా దెబ్బ ఇప్పుడు రాజకీయ నాయకులకు గట్టిగానే తగిలింది. స్థలం కనపడితే చాలు.. అది చెరువు అయినా, నది అయినా ఆక్రమించి కట్టారు చాలా మంది నేతలు. అందులో ఎవరికి ఏ మినహాయింపు లేదు. ఇప్పుడు హైడ్రా ఇలాంటి ఆక్రమణలను కూల్చే పని మీద ఉంది. ఇప్పుడు చెరువుల సర్వే విషయంలో ఓ డెడ్ లైన్ పెట్టుకుని హైడ్రా రంగంలోకి దిగింది. త్వరలోనే ఈ సర్వే పూర్తి చేసుకుని కొన్ని కీలక భవనాల మీద కన్నేసే అవకాశం కనపడుతోంది. హైడ్రా టార్గెట్స్ ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి కూడా.

ఈ విషయంలోనే కాస్త ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెందిన కొన్ని భవనాలను కూల్చే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది. ఇటీవల చంద్రబాబుని కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు హైడ్రా భయంతోనే కలిసినట్టుగా సమాచారం. తెలుగుదేశంలో ఉంటే రక్షణ ఉంటుందని చంద్రబాబు కాపాడతారు అని, చంద్రబాబు ఉంటే కేంద్రం అండ కూడా ఉంటుందని వాళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఊరక రారు మహానుభావులు అన్నట్టు… మల్లన్న ఏం చేసినా ఓ లెక్క ఉంటది. అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని చిందులేసినా ఆ తర్వాత కూల్ అయిపోయారు. రేవంత్ రెడ్డి అరె ఒరేయ్ అని మాట్లాడిన మల్లన్న ఇప్పుడు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఇక ఎప్పుడూ సౌమ్యంగా ఉండే మాధవరం కృష్ణా రావు… చూసి చూడనట్టు రేవంత్ పోవాలని ఏదో తన ప్రయత్నం తాను చేస్తున్నారు. గతంలో ఓ కంచంలో తిన్నోళ్ళం కదా ఇప్పుడు కాస్త కనికరించు సీఎం సారూ అన్నట్టు ఉంది ఈ ముగ్గురి తీరు. మరేం చేస్తారో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్