Wednesday, February 4, 2026 04:38 PM
Wednesday, February 4, 2026 04:38 PM

బోల్తా కొట్టిన బీఆర్ఎస్ పెద్దలు

తెలంగాణాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు భారత రాష్ట్ర సమితి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా కొన్ని అంశాలు మాత్రం ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పులు సృష్టిస్తున్నాయి. రాజకీయంగా బీఆర్ఎస్ ఎత్తుకునే అంశాలు ఆ పార్టీని ఇరుకున పడేస్తున్నాయనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలే చేస్తున్నారు. ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి, అరికేపూడి గాంధీ వ్యవహారం తీవ్ర దుమారమే రేపింది. ఈ వ్యవహారంలో గాంధీ తప్పు కంటే కౌశిక్ తప్పే చాలా మందికి కనపడింది. ముందు రెచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి అనే విషయం అందరికి తెలిసిందే.

Read Also : ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు

గాంధీ… బీఆర్ఎస్ లో పుట్టి బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే అవ్వలేదు. టీడీపీలో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ మర్చిపోయింది. కౌశిక్ రెడ్డి అప్పుడు హుజూరాబాద్ లో తిరుగుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ లాక్కుంది. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఫిరాయింపు అనే మాట మాట్లాడే ముందు గతం గుర్తు చేసుకుని ఉంటే బాగుండేది. ఇక ఆంధ్రా అనే అంశాన్ని కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చే ప్రయత్నం చేసాడు. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా గాంధీ ఆంధ్రా నుంచి వచ్చిన వ్యక్తే.

బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాలు చాలానే ఉన్నాయి. కీలక కాంట్రాక్టర్ లు కూడా బీఆర్ఎస్ పార్టీకి నిధులు ఇచ్చారు. వాళ్ళు కూడా ఆంధ్రా వాళ్ళే. ఈ విషయం కౌశిక్ రెడ్డికి అవగాహన లేకపోయి ఉండవచ్చు. ఈ విషయం బీఆర్ఎస్ కు లాభం కంటే నష్టమే ఎక్కువ చేసింది. గాజులు, చీరలు చూపించడం, ఎమ్మెల్యేని రెచ్చగొట్టి పాపులారిటీ తెచ్చుకోవాలని భావించడం అన్నీ కౌశిక్ రెడ్డి వైపే తప్పులు ఉన్నాయి. అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ ఆ విషయంలో సైలెంట్ అయి అవినీతి అనే మాటను తెరపైకి తెచ్చింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

పోల్స్