Friday, September 12, 2025 09:33 PM
Friday, September 12, 2025 09:33 PM
roots

దేవర కోసం సైఫ్ కష్టాలు.. మరీ ఈ రేంజ్ లోనా…?

సినిమా ప్రేక్షకులు, ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దేవర’ సినిమా ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలోగా నటిస్తున్న సినిమా కావడంతో జనాల్లో ఓ రేంజ్ లో ఆసక్తి ఉంది. సినిమా ఫ్లాప్ అయితే ఎన్టీఆర్ ఇమేజ్ పై కూడా కాస్త ప్రభావం పడవచ్చు. ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో, సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇక సైఫ్ పాత్ర ఎలా ఉంటుంది అనేది చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారిన అంశం. సైఫ్ పాత్ర విషయంలో దర్శకుడు కొరటాల శివ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అని తెలుస్తుంది.

Read Also : “దేవర”ను వెంటాడుతున్న నెగటివ్ వైబ్స్

ఈ సినిమా కోసం సైఫ్ చాలా కష్టపడ్డాడు అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. తన పాత్రకు న్యాయం చేకూర్చేందుకు నటుడు సైఫ్… కఠిన వర్కౌట్ లు చేసాడట. అలాగే మల్ల యుద్ధంలో పలు ట్రైనింగ్ సెషన్ లకు కూడా హాజరు అయ్యాడని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), హ్యాండ్-టు హ్యాండ్ కంబాట్, స్ట్రీట్ ఫైటింగ్‌ లో శిక్షణ కూడా తీసుకున్నాడట ఈ బాలీవుడ్ హీరో. దేవర సినిమాలో ఆ పాత్రలే ఎక్కువగా ఉండటంతో సైఫ్ వాటి కోసం ఆరు నెలలు సాధన చేసాడట.

ఫైట్ సీక్వెన్స్ ల్లో ఒక్కో షాట్ కోసం తీవ్రంగా శ్రమించాడట సైఫ్. ఇక దేవర సినిమాలో తన హెయిర్ స్టైల్ విషయంలో పక్కాగా జాగ్రత్తలు తీసుకున్నాడు ఈ హీరో. ఇప్పుడు ఈ విషయం ఫ్యాన్స్ లో విలన్ పాత్రపై కూడా క్రేజ్ పెంచుతోంది. ఇదిలా ఉంచితే ఈ సినిమా విడుదలకు ముందే అమెరికాలో ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుంది. విడుదలకు ముందే రెండు మిలియన్ వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తుండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్