Thursday, February 5, 2026 11:48 AM
Thursday, February 5, 2026 11:48 AM

బాబుకి బాసటగా మంత్రులు.. చక్కబడుతున్న పరిస్థితులు

విజయవాడలో వరద ముప్పు చుక్కలు చూపిస్తుంది. ఒకవైపు కృష్ణా నది, మరో వైపు బుడమేరు వాగు ఇలా పొంగి పోర్లడంతో ఇప్పుడు అధికారులు సైతం దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. అయితే ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ మాత్రం విరామం లేకుండా పని చేయడం చంద్రబాబుకి అదనపు బలం చేకూర్చింది. ముఖ్యంగా మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర ఇద్దరూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉంటున్నారు. రవీంద్ర ఉండే ఇల్లు వరద ముంపులో ఉన్నా సరే ఆయన మాత్రం వరుస పర్యటనలు చేస్తున్నారు.

నారాయణ అయితే రాత్రి నిద్ర లేకుండానే వరద ప్రాంతాల్లో గడిపారు. చంద్రబాబుకి అందుబాటులో ఉంటూనే ఇద్దరూ అధికారులతో సమన్వయము చేసుకుని పని చేస్తున్నారు. నారాయణ… తన కాలేజికి చెందిన వాహనాలను, భవనాలను వరద ముంపు బాధితుల కోసం వినియోగిస్తున్నారు. అలాగే ఇతర విద్యా సంస్థలతో కూడా చర్చలు జరిపి పెద్ద ఎత్తున స్కూల్, కాలేజి బస్ లను విజయవాడ తెప్పించారు. కలెక్టరేట్ భవనం వద్ద ఆ వాహనాలను మొహరించారు. అటు కొల్లు రవీంద్ర అయితే ఇబ్రహీంపట్నం, కృష్ణ లంక ప్రాంతాల్లో తిరుగుతున్నారు. హోమ్ మంత్రి అనిత కూడా స్థానికంగానే ఉంటూ బాధితులకి ఆహారం అందించే పనులు పర్యవేక్షిస్తున్నారు.

చంద్రబాబు పర్యటన అయిన తర్వాత వీళ్ళు వెళ్ళడం.. అక్కడ పరిస్థితి అడిగి తెలుసుకోవడంతో అధికారులు కూడా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నారాయణ… సింగ్ నగర్ లోనే ఉంటున్నారు. వరద ముంపుకు ఇళ్ళల్లోనే చిక్కుకున్న బాధితులను సురక్షితంగా తరలించడం, వారికి ఆహారం అందించడంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇక ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బొండా ఉమా చంద్రబాబు వెంటే ఉంటున్నారు. బాధితులకు ఆహారం, పునరావాసం కల్పించడంలో తన వద్ద ఉన్న అన్ని వనరులను వీళ్ళు వినియోగిస్తున్నారు. ఇలా చంద్రబాబుకి తోడు మంత్రులు కూడా శ్రమించడంతో పరిస్థితులు త్వరలోనే అదుపులోకి వస్తాయని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వాళ్లను ఎందుకు అరెస్టు...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

పోల్స్