Sunday, June 21, 2026 06:19 AM
Sunday, June 21, 2026 06:19 AM

జగన్ అనుకూల అధికారి పై చర్యలకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామి రెడ్డి అయితే జగన్ కు అనుచరుడుగా మారిపోయారు అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనపై చర్యలకు రంగం సిద్దమైనట్టుగా కనపడుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి కి ప్రచారం చేసి సస్పెండ్ అయిన సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్య క్షుడు కె.వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది.

15 రోజుల్లో దీనిపై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. సీసీఏ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఈ అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి సంజాయిషీ ఇచ్చాక క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. 2024 మార్చి 31న కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసారు. ఎన్నికల కోడ్ నీ ఉల్లంఘించరాని టీడీపీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

చంద్రయ్య, మరో 11 మందిని ఏప్రిల్ 4న సస్పెండ్ చేశారు అధికారులు. వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ను అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి నిలిపివేయడం వివాదాస్పదం అయింది. మీడియాలో రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సస్సెండ్ చేస్తూ జీవో జారీ చేశారు. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో సెక్షన్ అధికారి, సస్పెండ్ అయ్యేనాటికి ఇన్చార్జి అసిస్టెంట్ పోస్టులో ఉన్నారు. ఒక పార్టీకి అనుకూలంగా వ్వ్యవహరిస్తే రోస్టర్ నిబంధనల ప్రకారం ఆసోసియేషన్లో వెంకట్రామిరెడ్డి సభ్యత్వం కూడా రద్దు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్య నారాయణ విషయంలో గత ప్రభుత్వం ఇలాగే వ్యవహరించినట్టు ఉద్యోగులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్