Saturday, September 19, 2026 06:49 AM
Saturday, September 19, 2026 06:49 AM

తెలంగాణలో భారీగా డెంగ్యూ కేసులు..

తెలంగాణలో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా తెలంగాణలో సీజనల్ వ్యాధులు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా జ్వరాలు ప్రభలుతున్నాయి. ఈ నేపధ్యంలోనే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో రోజు రోజుకి డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆసుపత్రులలో ఓపీల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Also Read : ఏపీలో వెలుగులోకి మరో భారీ భూ కుంభకోణం

ఇందులో కొందరు రోగులు జ్వరం భారిన పడి మరణిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో వెయ్యికి పైగా ఓపీలు రిజిస్టర్ అయ్యాయని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఓపీలు పెరగడంతో ఆసుపత్రులలో వైద్యులు, బెడ్ల కొరత ఉందని రోగులు వాపోతున్నారు. సీజనల్ వ్యాధుల భారిన పడిన రోగులు ఆసుపత్రలకు క్యూ కడుతున్నారని, దీని కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని ఓ వైద్యాధికారి తెలిపారు. ఇక తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి ఈ నెల 4 వరకు 2,847 డెంగ్యూల కేసులు నమోదు అయ్యాయని, అందులో హైదరాబాద్‌లో 1101, ఖమ్మం 287, మేడ్చల్‌ 268, సూర్యాపేటలో 217 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. జులై 14 నాటికి తెలంగాణలో 6,500 టైఫాయిడ్‌, 140 మలేరియా కేసులు నమోదు అయ్యాయని వైద్యశాఖ నివేదిక వెల్లడించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్