Wednesday, August 5, 2026 11:02 AM
Wednesday, August 5, 2026 11:02 AM

టీం ఇండియా ముందు చిక్కు సమస్యలెన్నో..!

టీం ఇండియా మానేజ్మెంట్ ఇప్పుడు పూర్తి స్థాయి కెప్టెన్ ను వెతికే పనిలో పడింది. సీనియర్లు మరో రెండు, మూడేళ్ళలో పూర్తి స్థాయిలో రిటైర్ అవుతున్న నేపధ్యంలో ఓపెనర్లతో పాటుగా మూడు, నాలుగు స్థానాల మీద కూడా గట్టిగా దృష్టి సారిస్తున్నారు. రోహిత్ శర్మ ఓపెనర్ గా మరో రెండేళ్ళు కొనసాగే అవకాశం ఉంది. రోహిత్ తో పాటుగా గిల్ అలాగే జైస్వాల్ ఇద్దరూ సిద్దంగా ఉన్నారు. వీరితో టి20 లలో ఓపెనింగ్ చేయించే అవకాశం ఉంది. ఇక మూడో స్థానంలో అభిషేక్ శర్మను ఆడిస్తారని క్రీడా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆ స్థానంలో అతడు నిలదొక్కుకుంటే అతని స్థానం పదిలం అయినట్లే.

అభిషేక్ నిలదొక్కుకోకపోతే గిల్ ను మూడో స్థానంలో ఆడించే అవకాశాలు కనపడుతున్నాయి. టెస్ట్ ల విషయానికి వస్తే మరో మూడేళ్ళు ఇబ్బంది లేకపోయినా పుజారా స్థానాన్ని ఎవరితో పూర్తి స్థాయిలో భర్తీ చేస్తారంటే సమాధానం చెప్పడం కాస్త కష్టంగానే ఉంది ఈ ప్రశ్న. దానికి కెఎల్ రాహుల్ సమర్దుడే అయినా అతనిలో నిలకడ కనపడటం లేదు. మూడో స్థానంలో ఆడే పుజారా స్థానంలో ఖచ్చితంగా గిల్ ను ఆడిస్తే మంచి ఫలితం ఉండవచ్చు. జైస్వాల్ ఓపెనర్ గా ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి రోహిత్ రిటైర్ అయ్యే లోపు మరో ఓపెనర్ స్థానానికి ఒకరిని సిద్దం చేయాల్సి ఉంది.

గిల్ ను ఓపెనర్ గా పంపించి మూడో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను వాడుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంలో జట్టు యాజమాన్యం ఉందని అంటున్నారు. గైక్వాడ్ లో నిలకడ ఉంటుంది. కాబట్టి అతన్ని టెస్ట్ జట్టు లోకి తీసుకొస్తే మంచిది. అలాగే శ్రేయాస్ అయ్యర్ నుంచి కూడా గట్టి పోటీ ఉండవచ్చు గాని నిలకడ తక్కువగా కనపడుతుంది. ఇక కెప్టెన్ గా గిల్ ను లైన్ లోకి తీసుకురావాలంటే మాత్రం ఖచ్చితంగా అతనికి వైస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది ఇప్పుడే. లేదంటే టి20 జట్టుకి కెప్టెన్ ను చేస్తే మంచిది. ఏది ఏమైనా మంచి బెంచ్ ఉన్న టీం ఇండియాకి ఆటగాళ్ళని సిద్ధం చేయడం కష్టం కాకపోవచ్చు. అయితే ఒక్కసారిగా వచ్చే డబ్బు, పలుకుబడి వారిని ఆటకి దూరం చేయకుండా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్