Friday, November 27, 2026 08:12 PM
Friday, November 27, 2026 08:12 PM

కేంద్రానికి షాక్ ఇచ్చిన డీఎంకే.. చంద్రబాబు రాయబారం ఫలిస్తుందా..?

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కీలకమైన ‘డీలిమిటేషన్ బిల్లు’కు (నియోజకవర్గాల పునర్విభజన బిల్లు) డీఎంకే మద్దతు ఇస్తోందంటూ జాతీయ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ఈ బిల్లు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ ప్రక్రియపై డీఎంకే మొదటి నుంచీ వినిపిస్తున్న రెండు ప్రధాన డిమాండ్లకు తాము ఇప్పటికీ పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు.

Also Read : మదురై దీపతూన్ వివాదంలో బిగ్ ట్విస్ట్.. విజయ్ కు సుప్రీం షాక్..!

మొదటి డిమాండ్ ప్రకారం, ఒకవేళ లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచితే సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం వాటా ఏమాత్రం తగ్గకూడదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదని, జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరిగితే ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యం పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రెండో డిమాండ్ ప్రకారం, 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు ఉన్న పార్లమెంటు ప్రాతినిధ్యాన్ని మరో 25 ఏళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని స్టాలిన్ స్పష్టం చేశారు.

Also Read : తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై టీటీడీ కీలక ప్రకటన..!

ఈ రెండు కీలక డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అంగీకరించి, బిల్లులో స్పష్టమైన రాజ్యాంగబద్ధమైన హామీ కల్పిస్తేనే తమ వైఖరిపై ఆలోచిస్తామని, లేదంటే బిల్లు విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదని స్టాలిన్ తేల్చి చెప్పారు. మరోవైపు, నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకోవడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలను ఒప్పించే బాధ్యతను ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇలాంటి కీలక సమయంలోనే స్టాలిన్ ‘కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదు’ అంటూ ప్రకటన చేయడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. పార్లమెంటులో తమిళనాడు హక్కుల కోసం డీఎంకే ఎంపీలు గట్టిగా పోరాడుతారని స్టాలిన్ స్పష్టం చేయడంతో, బిల్లు ఆమోదం విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

తిరుమల భక్తులకు గుడ్...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర...

ఎన్డీఏకు జగన్ అండ.....

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న...

గన్నవరంలో టీడీపీకి దిమ్మ...

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయం...

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

సొంత జిల్లాలో జగన్...

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

పోల్స్