Friday, November 27, 2026 08:03 PM
Friday, November 27, 2026 08:03 PM

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దుపై టీటీడీ కీలక ప్రకటన..!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త అందించింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన వివిధ రకాల టికెట్లు, సర్వదర్శనం టోకెన్ల విడుదల తేదీలను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆన్‌లైన్ ద్వారా టికెట్లు, టోకెన్ల కేటాయింపుకు స్పష్టమైన షెడ్యూల్‌ను విడుదల చేసింది. టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, శనివారం ఉదయం 10 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతల దర్శన టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

Also Read : భారత మార్కెట్లోకి తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ కారు..!

అనంతరం నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు సామాన్య భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో కేటాయించనున్నారు. ఇందుకోసం భక్తులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

Also Read : అమెరికాలోని భారత టెక్కీలకు ఐబీఎం భారీ షాక్..!

రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను కేటాయించి, మొబైల్ సందేశాల ద్వారా సమాచారం అందించనున్నారు. మరోవైపు, వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలైన డిసెంబర్ 20, 21 తేదీల్లో భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సాధారణ వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులందరూ ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే తమ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

కేంద్రానికి షాక్ ఇచ్చిన...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ...

ఎన్డీఏకు జగన్ అండ.....

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న...

గన్నవరంలో టీడీపీకి దిమ్మ...

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయం...

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

సొంత జిల్లాలో జగన్...

కడప జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం...

పోల్స్