Friday, November 27, 2026 08:21 PM
Friday, November 27, 2026 08:21 PM

అమెరికాలోని భారత టెక్కీలకు ఐబీఎం భారీ షాక్..!

అమెరికాలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలనుకునే వేలాది మంది భారత ఐటీ నిపుణులకు ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం గట్టి షాక్ ఇచ్చింది. తన కన్సల్టింగ్ విభాగంలోని మెజారిటీ ఉద్యోగాలకు యూఎస్ వర్క్ వీసాలు, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్‌లను నిలిపివేస్తున్నట్లు ఐబీఎం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్న ‘ఐబీఎం కన్సల్టింగ్’ విభాగంపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. కంపెనీ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభావితమైన ఉద్యోగులు 2026 డిసెంబర్ 31 లోపు అమెరికాను వదిలి వేరే దేశానికి (భారత్ సహా) బదిలీ అవ్వాలి, లేదా ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సి ఉంటుందని ఐబీఎం స్పష్టం చేసింది.

Also Read : చలికాలంలో గుండెపోటు ముప్పు ఎందుకు పెరుగుతుంది..?

ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఇచ్చిన కంపెనీ, విదేశాలకు వెళ్లడానికి ఇష్టపడని వారికి మూడు నెలల వేతనం ఇచ్చి డిసెంబర్ 31తో విధుల నుంచి తప్పించనుంది. మారుతున్న వ్యాపార అవసరాలు, స్థానికంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగుల లభ్యత పెరగడం వల్లే వీసా స్పాన్సర్‌షిప్‌లను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐబీఎం ప్రతినిధి వెల్లడించారు. 2024 నుంచి కన్సల్టింగ్ వ్యాపార వృద్ధి మందగించడంతో, రెడ్ హ్యాట్, హాషికార్ప్ వంటి కొనుగోళ్ల ద్వారా పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారిత సంస్థగా మారేందుకు ఐబీఎం ఈ వ్యూహాత్మక అడుగు వేస్తోంది. అయితే, అమెరికా వదిలి వచ్చే ఉద్యోగులకు భారత్ ప్రధాన గమ్యస్థానంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Also Read : గన్నవరంలో టీడీపీకి దిమ్మ తిరిగే షాక్..!

ఇటీవల ఐబీఎం కెరీర్ పోర్టల్‌లో అమెరికా వెలుపల 1,278 కన్సల్టింగ్ ఖాళీలను ప్రకటించగా, అందులో ఏకంగా 1,125 ఉద్యోగాలు ఒక్క భారతదేశంలోనే ఉండటం గమనార్హం. కానీ అమెరికాలో స్థిరపడిన వారు భారత్‌కు తిరిగి వస్తే వేతనాలు, జీవనశైలిలో భారీ మార్పులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు, అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్న తరుణంలో ఐబీఎం నిర్ణయం భారతీయ టెక్కీలను మరింత ఆందోళనలోకి నెట్టింది. కొత్త H-1B పిటిషన్లపై 1,00,000 డాలర్ల భారీ ఫీజు ప్రతిపాదనతో పాటు, గత నెలలో మైక్రోసాఫ్ట్, అడోబ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలపై గ్రీన్ కార్డ్ ప్రక్రియ విషయంలో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాలోని భారతీయ నిపుణులు కేవలం కంపెనీ స్పాన్సర్ చేసే వీసాలపైనే ఆధారపడకుండా, ఏఐ, ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ముంబై బాస్‌ మళ్లీ...

ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు మరోసారి...

కేంద్రానికి షాక్ ఇచ్చిన...

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీఏ...

తిరుమల భక్తులకు గుడ్...

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర...

ఎన్డీఏకు జగన్ అండ.....

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న...

గన్నవరంలో టీడీపీకి దిమ్మ...

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ రాజకీయం...

పవన్ మాస్టర్ స్ట్రోక్.....

గ్రామీణ రాజకీయాల్లో జనసేన తనదైన ముద్ర...

పోల్స్